Jayashankar
- Jan 11, 2021 , 02:32:59
VIDEOS
పీడీఎస్ బియ్యం పట్టివేత

కాళేశ్వరం జనవరి 10 : మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్ రాష్ట్ర వంతెన వద్ద 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు కాళేశ్వరం ఎస్సై నరహరి ఆదివారం తెలిపారు. మహాముత్తారం మండలం నుంచి మహారాష్ట్రకు అక్రమంగా డీసీఎం వ్యాన్లో తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకొని, ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, వ్యాన్ను సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. టేకుమట్ల మండలం బూర్నపల్లి గ్రామంలో వినియోగదారుల నుంచి సేకరించి అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన పురాణం జంపయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమణారెడ్డి తెలిపారు.
తాజావార్తలు
MOST READ
TRENDING