శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Jan 10, 2021 , 02:27:33

కొనసాగుతున్న కబడ్డీ పోటీలు

కొనసాగుతున్న కబడ్డీ పోటీలు

చిట్యాల, జనవరి9: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చల్లగరిగెలో కొండయ్య-లక్ష్మి స్మారకార్థంగా నిర్వహించిన జిల్లా స్థాయి గ్రామీణ క్రీడా కబడ్డీ పోటీలు శనివారం పోటాపోటీగా సాగాయి. రెండో రోజు ప్రారంభమైన కబడ్డీ పోటీలకు మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ మండల నాయకులు కర్రె అశోక్‌రెడ్డి, రబ్బాని, జన్నె యుగేందర్‌, పువ్వాటి హరికృష్ణ, మాజీ జడ్పీటీసీ సాయిలు పాల్గొన్నారు

VIDEOS

తాజావార్తలు


logo