పామాయిల్ సాగుపై స్టడీ టూర్

- 170 మంది రైతులతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర భద్రాద్రి జిల్లాలో పర్యటన
- సాగుపై రైతులకు అవగాహన
భూపాలపల్లి టౌన్, జనవరి 9 : ప్రభుత్వం పామాయిల్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించి రైతులను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే కేంద్ర పరిశోధన బృందం తెలంగాణలో పర్యటించి ఆయిల్‌పాం సాగుకు అనువైన భూముల జాబితాను తయారు చేసింది. ఆ జాబితాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కూడా ఉంది. ఈక్రమం లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయిల్‌పాం పంటల అధ్యయనం కోసం 170 మంది రైతులతో స్టడీ టూర్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గండ్ర, రూరల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా హార్టికల్చర్ అధికారి, రైతులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. అశ్వారావుపేట, దమ్మపేట, అప్పారావుపేట గ్రామాల్లో సాగవుతున్న పామాయిల్ పంటలు, అశ్వారావుపేట ఫ్యాక్టరీలో పామాయిల్ తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లాలో 49,750 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఒకసారి పంటవేస్తే నాలుగో సంవత్సరం నుంచి క్రాప్ చేతికి వస్తుందని, ప్రతి రెండు నెలలకు ఒకసారి సీడ్ కోసి ఫ్యాక్టరీకి తరలించొచ్చన్నారు. మొదటి నాలుగేళ్ల పాటు తోటలో అంతర్ పంటలు వేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభ, ఎంపీపీ మందల లావణ్య, రైతుబంధు సమితి బాధ్యుడు భార్గవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!