ఆదివారం 07 మార్చి 2021
Jayashankar - Jan 09, 2021 , 02:21:18

డ్రైరన్‌ విజయవంతం

డ్రైరన్‌ విజయవంతం

  • పర్యవేక్షించిన కలెక్టర్‌, డీఎంహెచ్‌వో

భూపాలపల్లి టౌన్‌, జనవరి 8: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన కరోనా వ్యాక్సి న్‌  డ్రైరన్‌ విజయవంతంగా ముగిసింది.  భూపాలపల్లి, కాటారం పీహెచ్‌సీలలో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య , అంబట్‌పల్లిలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధార్‌సింగ్‌ పర్యవేక్షించారు. భూపాలపల్లిలో డ్రైరన్‌ను పర్యవేక్షించిన కలెక్టర్‌ వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. వ్యాక్సిన్‌ వేసే విధా నం, తదితర వివరాలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 12 పీహెచ్‌సీలు, 2 సీహెచ్‌సీలు ఉన్నాయని మొత్తం 14 కోల్డ్‌చైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడుతగా ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి వైద్యు లు, సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు మొత్తం 2191 మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు పేర్లు నమోదు చేసినట్లు తెలిపారు. భూపాలపల్లి పీహెచ్‌సీలో 25 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ అందజేయనున్నట్లు చెప్పారు. ప్రతి సెంటర్‌లో మూడు రూంలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఐదుగురు వ్యాక్సినేటర్లు ఉంటారని తెలిపారు.  కార్యక్రమంలో భూపాలపల్లి పీహెచ్‌సీ వైద్యుడు రవికుమార్‌, సిబ్బంది ఉన్నారు.

 ములుగు జిల్లాలో..

ములుగు రూరల్‌ :  ములుగు ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన డ్రైరన్‌ సెంటర్‌ను ఏఎస్పీ సాయిచైతన్య, డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య, దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రైరన్‌ నిర్వహణ తీరుపై ఏఎస్పీకి డీఎంహెచ్‌వో వివరించారు. జిల్లాలోని 16 పీహెచ్‌సీ కేంద్రాల పరిధిలో కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను నిర్వహించి మొత్తం 362 మందికి వ్యాక్సిన్‌ను అందించినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని సెంటర్లలో వ్యాక్సినేషన్‌ డ్రైరన్‌ విజయవంతమైనట్లు వివరించారు. కార్యక్రమంలో డీవో శ్యాంసుందర్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ చందూనాయక్‌, డెమో నవీన్‌రాజ్‌కుమార్‌,  తదితరులు పాల్గొన్నారు. 

వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలి 

ఏటూరునాగారం : కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమా న్ని విజయవంతంగా కొనసాగించాలని ఐటీడీఏ పీవో హన్మంత్‌ కొండిబా ఆదేశించారు. మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో కరోనా డ్రైరన్‌ సెంటర్‌ను సూపరిండెంటెంట్‌ సురేశ్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కువ మంది వ్యాక్సిన్‌ తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే సెంటర్‌ ముందు టెంట్లు వేసి వ్యాక్సిన్‌ అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు రాహిల్‌, నరహరి, సిబ్బంది సావిత్రి, హన్నామణి, సంధ్య, పుష్పలత, భాస్కర్‌, విజయ్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo