సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Jan 09, 2021 , 02:21:16

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

భూపాలపల్లి, జనవరి 8 : ఆన్‌లైన్‌లో లోన్లు, ప్రైజ్‌మనీ, కరోనా నివారణ వ్యాక్సిన్‌ పేరుతో కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారని అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఏఎస్పీ వీ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. కరోనా నివారణ వ్యాక్సిన్‌  ముందుగా మీకే అందజేస్తామని ఆధార్‌కార్డు నంబర్‌, సెల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పాలని ఫోన్లు వస్తున్నాయన్నారు. డబ్బులు కొల్లగొట్టేందుకు సైబర్‌ నేరగాళ్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం తెలియజేయాలన్నారు.


VIDEOS

logo