భగీరథ భేష్

- జాతీయ జల్ జీవన్ మిషన్ బృందం సభ్యుల ప్రశంస
- కాటారంలో కేంద్ర బృందం క్షేత్ర పర్యటన
కాటారం, జనవరి 8: ప్రజలకు ఇంటింటికీ అమృత జలాలు అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం భేషుగ్గా ఉందని జాతీయ జల్ జీవన్ మిషన్ సభ్యులు పరమేశ్వరన్, విద్యాసాగర్ అన్నారు. శుక్రవారం వారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పోతుల్వాయి గ్రామంలో మిషన్ భగీరథ పథకం అమలు తీరును ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను పరిశీలించారు. సర్పంచ్ దబ్బెట సరోజన, ఎంపీటీసీ విజయారెడ్డితో కలిసి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసే కుళాయిలను ప్రారంభించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాపై గ్రామస్తులతో మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా శుద్ధమైన జలాలు ఇంటికే వస్తుండడంతో దశాబ్దాల కాలంగా పడిన తాగునీటి కష్టాలు తొలగిపోయాయని గ్రామస్తులు చెప్పడంతో బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బృందం సభ్యులు మాట్లాడు తూ.. 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించడమే కేంద్ర జల్ శక్తి శాఖ లక్ష్యమని అన్నారు. ఆర్వో ప్లాంట్ల నీటి కన్నా ప్రభుత్వాలు అందించే తాగునీరు సురక్షితమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ తాగునీరు అందించే నినాదంతో జల్ జీవన్ మిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ సీఈ జ్ఞాన్‌కుమార్, ఎస్ఈ రాంచంద్ నాయక్, ఇంజినీర్లు ఈఈ నిర్మల, డీఈ రమేశ్, మణిక్యాల్రావు, ఎంపీడీవవో శంకర్, ఎంపీవో మల్లికార్జున్ రెడ్డి, ఏఈ రాజశేఖర్, మిషన్ భగీరథ, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా
- నా మీటింగ్‌కు అనుమతి ఇవ్వడం లేదు..
- స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్
- బెస్ట్ ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్