ఆదివారం 07 మార్చి 2021
Jayashankar - Jan 08, 2021 , 01:04:39

సంక్రాంతికి స్పెషల్‌ బస్సులు

సంక్రాంతికి స్పెషల్‌ బస్సులు

  • నేటి నుంచి 13 వరకు.. అందుబాటులో 450 బస్సులు 
  • ఆర్టీసీ ఆర్‌ఎం ఎస్వీజీ కృష్ణమూర్తి 

హన్మకొండ చౌరస్తా, జనవరి 7 : సంక్రాంతి పండు గ సందర్భంగా ఈ నెల 8 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం ఎస్వీజీ కృష్ణమూర్తి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హన్మకొండ, వరంగల్‌-1, వరంగల్‌-2, నర్సంపేట, భూపాలపల్లి, మహబూబాబాద్‌, పరకాల, జనగామ, తొర్రూరు డిపోల నుంచి హైదరాబాద్‌, వివిధ ప్రాంతాలకు నడిపిచేందుకు 450 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సుమారు 50 బస్సులు అదనంగా నడిపేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.27అంతర్రాష్ట్ర ప్రత్యేక సర్వీసులు, 38 రెగ్యులర్‌ అంతర్రాష్ట్ర సర్వీసులకు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అలాగే ఐనవోలు జాతరకు వరంగల్‌ బస్‌స్టేషన్‌ నుంచి హన్మకొండ డిపో ఆధ్వర్యంలో 50 ప్రత్యేక బస్సులు, ఐనవోలు నుంచి కొమురవెల్లి, యాదగిరిగుట్ట, వేములవాడ, హైదరాబాద్‌కు 13 నుంచి 16 వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు వివరించారు. కొత్తకొండ జాతరకు హన్మకొండ బస్‌స్టేషన్‌ నుంచి వరంగల్‌-1 డిపో ఆధ్వర్యంలో 30 ప్రత్యేక బస్సులను ఈ నెల 13 నుంచి 16 వరకు నడుపనున్నట్లు చెప్పారు. ప్రత్యేక సర్వీసులకు అదనపు చార్జీలు వర్తిస్తాయన్నారు. ప్రయాణికుల రద్దీకనుగుణంగా వివిధ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచామన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్‌ఎం ఎస్వీజీ కృష్ణమూర్తి కోరారు.


VIDEOS

logo