ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 07, 2021 , 03:32:34

ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి అభినందనీయం

ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి అభినందనీయం

  • ఎమ్మెల్యే గండ్రవెంకట రమణారెడ్డి 

టేకుమట్ల, జనవరి6: మండల అభివృద్ధి పనుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో చేస్తున్న కృషి అభినందనీయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి అధ్యక్షత నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన కార్యాలయాలకు భూమిని సాధించడంలో టేకుమట్ల సర్పంచ్‌ సరోత్తంరెడ్డి, ఎంపీటీసీ ఆధి సునీతరఘు, ఎంపీపీ, జడ్పీటీసీలు, అధికారులు సఫలీకృతులయ్యారని అభినందించారు. వెల్లంపల్లి గ్రామంలోని మహిళా సంఘాలకు తెలియకుండా ఐకేపీ సిబ్బంది స్త్రీ నిధి డబ్బులు కాజేశారని, ఏపీఎం సమావేశాలకు హాజరు కావడం లేదని ఎంపీటీసీ సంగి రవి ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అన్నారు. టేకుమట్ల మండల నుంచి ఎంపేడు, వెల్లంపల్లి, దుబ్యాల, మందలోరిపల్లి గ్రామాలను కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలో కలుపుతున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్యే అన్నారు. చిట్యాల మండలంలోని గిద్దెముత్తారం, కాల్వపల్లిని ఆ గ్రామాలను త్వరలో టేకుమట్ల మండలంలో కలుపుతామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, వైస్‌ ఎంపీపీ పోతనవేని ఐలయ్య, జిల్లా ఉద్యానవన అధికారి అక్బర్‌, తహసీల్దార్‌ చందా నరేశ్‌, ఎంపీడీవో చండీరాణి, ఏపీవో మాదవి, ఎంపీవో తేజశ్రీ, ఏవో శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo