సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Jan 07, 2021 , 03:25:10

‘వేదిక’ను సద్వినియోగం చేసుకోవాలి

‘వేదిక’ను సద్వినియోగం చేసుకోవాలి

భూపాలపల్లి టౌన్‌, జనవరి6: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని వేదిక చైర్మన్‌ సీ. సత్యనారాయణ కోరారు. బుధవారం భూపాలపల్లి సబ్‌స్టేషన్‌ ఆవరణలో విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన వినియోగదారుల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేశారు. నాలుగు మండలాల వినియోగదారులు హాజరయ్యారని, పలు సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించి మిగిలిన సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమం ఆరు నెలలకొకసారి నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వేదిక సభ్యులు తిరుమల్‌రావు, చరణ్‌దాస్‌, గణపతిరెడ్డి, ఎస్‌ఈ బికంసింగ్‌, డీఈ నాగరాజు, ఏఈ వెంకటరమణ పాల్గొన్నారు.


VIDEOS

logo