బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 06, 2021 , 02:22:42

మావోయిస్టులు వనం వీడి జనంలో చేరాలి

మావోయిస్టులు వనం వీడి జనంలో చేరాలి

పలిమెల, జనవరి5: మావోయిస్టులు వనం వీడి జన జీవన స్రవంతిలో చేరి కుటుంబాలతో సంతోషంగా గడుపాలని కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌పటేల్‌ కోరారు. మంగళవారం మండలంలోని బోడయిగూడెం గ్రామంలో సివిల్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలతో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఉదయాన్నే గ్రామానికి చేరుకున్న పోలీసులు ప్రతి ఇంటినీ తనిఖీ చేసి అనూమానితులను విచారించి వదిలేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అలజడి వాతావరణం సృస్టించేందుకు మావోయిస్టులు పన్నాగం పన్నుతున్నారన్నారు. గ్రామంలో ఎవరైనా చట్టవ్యతిరేక శక్తులకు ఆశ్రయం కల్పిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మహదేవపూర్‌ సీఐ అంబటి నర్సయ్య, పలిమెల ఎస్సై శ్యాంరాజ్‌ పటేల్‌ పాల్గొన్నాయి.  

పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు ప్రారంభం

పలిమెల మండలకేంద్రంలో నూతన పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌పటేల్‌ అన్నారు. మంగళవారం భవనం పునాది పనులను ఆయన ప్రారంభించారు. పలిమెల గ్రామ కంఠం భూమిలోని ఐదెకరాల స్థలంలో రూ.2 కోట్ల నిధులతో పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణ పనులు వేసవిలోగా పూర్తవుతాయన్నారు.

VIDEOS

logo