బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 06, 2021 , 02:22:44

రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు

రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు

  • కార్పొరేట్‌ బ్యాంకులకు దీటుగా కేడీసీసీ బ్యాంక్‌ సేవలు
  • జాతీయ కోఆపరేటివ్‌ బ్యాంకుల సమాఖ్య చైర్మన్‌ కొండూరి రవీందర్‌ రావు 

కాటారం, జనవరి 5: రైతులను మరింత అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు వారికి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చి కార్పొరేట్‌ బ్యాంకులకు దీటుగా కేడీసీసీ బ్యాంకులను తీర్చిదిద్దుతామని జాతీయ కోఆపరేటివ్‌ బ్యాంకుల సమాఖ్య చైర్మన్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. కాటారం మండల కేంద్రంలో కేడీసీసీ బ్యాంక్‌ ఏటీఎం సేవలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం సబ్‌డివిజన్‌ పరిధిలోని సహకార సంఘాల బాధ్యులు, పీఏసీఎస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, కేడీసీసీ బ్యాంకు ప్రతినిధులు, రైతులు, ఖాతాదారులతో మాట్లాడారు. సహకార సంఘాల ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఆశిస్తున్న సేవలను, పీఏసీఎస్‌ అభివృద్ధికి సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు రానున్న రోజుల్లో మరింత మెరుగైన సేవలందిస్తామన్నారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బిడ్డ అయిన రవీందర్‌రావు జాతీయ కోఆపరేటివ్‌ బ్యాంకుల సమాఖ్య చైర్మన్‌గా ఎన్నికకావడం గర్వకారణమన్నారు. అనంతరం కొండూరి రవీందర్‌రావును పీఏసీఎస్‌ పాలకవర్గం, కేడీసీసీ బ్యాంక్‌ సిబ్బంది సన్మానించారు. ఎంపీపీ సమ్మయ్య, డీసీసీబీ కరీంనగర్‌ వైస్‌ చైర్మన్‌ రమేశ్‌, సీఈవో సత్యనారాయణ, డైరెక్టర్‌ రాజిరెడ్డి, చైర్మన్లు నారాయణరెడ్డి, తిరుపతిరెడ్డి, రామారావు, శాంతకుమార్‌, కేడీసీసీ బ్యాంక్‌ డీజీఎం శ్రీధర్‌, రియాజ్‌, మేనేజర్‌ రామకృష్ణ, పీఏసీఎస్‌ సీఈవో సతీశ్‌, వైస్‌ చైర్మన్‌ స్వామి, ఎంపీటీసీ మహేశ్వరి,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అర్జయ్య, రాము గౌడ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo