మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Jan 05, 2021 , 02:02:51

వైభవంగా మల్లన్నకు బోనం

వైభవంగా మల్లన్నకు బోనం

కాటారం, జనవరి 4: మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌పల్లిలో పుట్ట మల్లన్న, మర్రిపల్లిలో మల్లన్న, నస్తూర్‌పల్లిలో  మల్లికార్జున స్వామి బోనాల జాతర సోమవారం వైభవంగా జరిగింది. ఒగ్గు కళాకారుల డోలు వాయిద్యాల చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, లక్ష్మీదేవర విన్యాసాల నడుమ పారవశ్యంలో భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. పుట్ట మల్లన్న దేవుని ఆలయం ఎదుట ఒగ్గు కళా కారు లు పెద్ద పట్నాలు వేశారు. అనంతరం శివసత్తులు, లక్ష్మీదేవరలు, డోలు వాయిద్యా లు, డప్పుచప్పుళ్ల మధ్య పూనకాలతో భక్తులకు భవిష్యవాణి వినిపించారు. మహి ళలు మల్లన్న ఆలయం వద్ద  బోనాలను వండి దేవుడికి సమర్పించారు. బోనాల జాతరకు వివిధ జిల్లాల నుంచి వందలాది మంది భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు.

VIDEOS

logo