సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Jan 04, 2021 , 03:37:05

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

కాటారం/మహదేవపూర్‌/పలిమెల, జనవరి 3: కాటారం మండలంలోని దామెరకుంట, మహదేవపూర్‌ మండలంలోని అన్నారం 33 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రాల పరిధిలో మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ సంపత్‌ రావు, ఏఈ ఆంజనేయులు తెలిపారు. మహదేవపూర్‌ మండలం పెద్దంపేట, సూరారం, కాళేశ్వరం గ్రామాల్లోని సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. సర్వాయిపేట సబ్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటందని అధికారులు తెలిపారు.


VIDEOS

logo