రా.. రమ్మని పిలుస్తున్న ప్రకృతి అందాలు

- రాక్ ైక్లెంబింగ్, ట్రెక్కింగ్
- వంటి సాహస క్రీడలకు కేరాఫ్
- అబ్బురపరుస్తున్న శిలాకృతులు, గుట్టలు, పచ్చని చెట్లు
- రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకుల తాకిడి
- నైట్ హాల్టింగ్‌కు ప్రత్యేకం,సెలవు రోజుల్లో మరింత సందడి
రాక్ ైక్లెంబింగ్ అంటే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది పాండవుల గుట్టలే. పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్న ఈ గుట్టలను 2017లో ఎకో టూరిజం శాఖ తన ఆధీనంలోకి తీసుకొని రాక్ ైక్లెంబింగ్, రాక్ఫెల్లింగ్, ట్రెక్కింగ్, హైకింగ్ వంటి విన్యాసాలను ప్రవేశపెట్టింది. దీనిపై ఎకో టూరిజం, అటవీశాఖ అధికారులు విస్తృత ప్రచారం కల్పించారు. అప్పుడు ఒకరిద్దరితో ప్రారంభమైన రాక్ైక్లెంబింగ్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి, డీఎఫ్‌వో అర్పన వంటి అధికారులు సైతం రాక్ైక్లెంబింగ్ చేసి యువతలో ఉత్సాహం నింపారు. నెలలో సుమారు 200 మందికిపైగా రాక్ైక్లెంబింగ్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేకంగా ఇందుకోసమే కొందరు పర్యాటకులు ఇక్కడి వస్తుండడం విశేషం. రాక్ైక్లెంబింగ్కు రుసుము రూ.400 వసూలు చేస్తున్నారు. సెలవు రోజులతో పాటు శని, ఆదివారాల్లో మాత్రమే రాక్ైక్లెంబింగ్, ట్రెక్కింగ్, హైకింగ్ వంటి విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు నైట్‌హాల్ట్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి బస చేసేందుకు గుడారాలు, బృంద చర్చల కోసం టేబుల్స్, కుర్చీలు, రాత్రి భోజనం, టీ, ఉదయం టిఫిన్, టీ వంటివి అందిస్తున్నారు. నైట్హాల్టింగ్, భోజనం, ట్రెక్కింగ్ కోసం ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున ఫీజు తీసుకుంటున్నారు.
ప్రకృతి అందాలకు నెలవు పాండవుల గుట్టలు. చుట్టూ ఎత్తయిన గుట్టలు.. పచ్చని చెట్లు.. ప్రకృతి రమణీయత.. అబ్బురపరిచే శిలాకృతులు వీటి సొంతం. అరకులోయను తలపించే అందాలతో పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుట్టలు ప్రకృతి ప్రేమికులను రా.. రమ్మని పిలుస్తున్నాయి. రాక్ ైక్లెంబింగ్, ట్రెక్కింగ్ వంటి విన్యాసాలకు అనుకూలంగా ఉండడంతో దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు.
- రేగొండ
సహజ సిద్ధంగా ఏర్పడిన పాండవుల గుట్టలను పాండవుల గుహ అని కూడా అంటారు. ఇక్కడ పాండవులు నడయాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. 1990 లో ప్రభుత్వం వీటిని గుర్తించింది. వరంగల్ నగరానికి 55 కిలోమీటర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 22 కి.మీ, రేగొండ మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో రావులపల్లె పరిసరాల్లో ఈ గుట్టలు విస్తరించి ఉన్నాయి. రాక్ైక్లెంబింగ్కు ఈ గుట్టలు అనుకూలం. ప్రతి రోజూ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు టూరిస్టులు సందర్శించవచ్చు. పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10 ప్రవేశ రుసుముగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ గుట్టల్లో పాటల ఆల్బమ్స్, షార్ట్ ఫిలింలు తీస్తున్నారు. ప్రకృతి ఒడిలో విరబూసిన ఈ అద్భుత గుహలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. సున్నపురాళ్ల అవక్షేప శిలలతో ఏర్పడిన ఈ గుట్టలు పొరలు పొరలుగా ఒకదానిపై ఇంకొకటి పేర్చినట్లు ఉంటాయి. ఎత్తయిన బండరాళ్లు, వాటి మధ్య లోతైన అగాధాలు, లోయలు, పాము పడిగెత్తి నిల్చున్నట్లుగా కొండవాలు, వాటిపై అపురూపమైన ప్రాచీనరాతి చిత్రాలు పర్యాటకులను మురిపిస్తున్నాయి. ఎదురు పాండవులు, గొంతెమ్మ గుహ, పంచపాండవుల గోనె, పోతరాజు చెలిమె, మేకల బండ, ముంగీస బండ, తుపాకుల గుండు, యానాదుల గుహలు ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. గొంతెమ్మ గుహ, పంచపాండవుల గోనెల్లో అద్భుతమైన శిల్ప సంపద ఉంది. ప్రాక్ యుగం నుంచి చారిత్రక యుగం దాకా వేయబడిన రాతి చిత్రాలు నాటి ప్రజల జీవనశైలికి అద్దం పడుతున్నాయి. ఈ పాండవుల గుట్టలపైనే బుగులోని వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. పాండవుల గుహలకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం లో ఏటా జాతర జరుగుతుంది. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక్కడ దేవాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇటీవల రూ.55 లక్షల నిధులు మంజూరు చేసింది.
ఆదాయంతో పాటు ఉపాధి..
పాండవుల గుట్టల్లో రాక్ ైక్లెంబింగ్ ఏర్పాటు చేయడం ద్వారా అటవీ, ఎకో టూరిజం శాఖకు ఆదాయంతోపాటు స్థానిక యవకులకు ఉపాధి కలుగుతున్నది. మొదట్లో మాకు ట్రైనింగ్ ఇప్పించారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఇప్పుడు సొంతంగా మేమే నిర్వహిస్తున్నాం. ైక్లెంబర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఫారెస్టు, ఎకోటూరిజం అధికారుల సహకారం బాగుంది.
- ఇన్స్ట్రక్టర్ భాస్కర్
మరువలేని అనుభూతి
పాండవుల గుట్టల్లో చేసిన రాక్ ైక్లెంబింగ్ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేను. సహజ సిద్ధ అందాలు ఈ గుట్టల సొంతం. పాండవుల కాలం నాటి చిత్రాలు, పెయింటింగ్ అద్భుతంగా ఉన్నాయి. శిల్పకళా ఆకృతి ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి వస్తే సమయం కూడా తెలియదు.
- శ్రుతి, హైదరాబాద్
పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు
సహజసిద్ధ అందాలకు నెలవు పాండవుల గుట్టలు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది. కాటేజీల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిం చాం. అనుమతి రాగానే నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తాం.
- ప్రసాద్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్
గుట్టల అమరిక అద్భుతం
పాండవుల గుట్టల అమరిక అద్భుతం. చుట్టూ ఎత్తయిన కొండలు, గుహలు, పచ్చని చెట్లు, పంటపొలాలు మనస్సు దోచుకుంటాయి. ఈ గుట్టల్లో రాక్ ైక్లెంబింగ్ చేయడం అనేది గొప్పవరం. ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన ప్రదేశం.
- నగేశ్, హన్మకొండ
రాక్ ైక్లెంబింగ్.. నైట్‌హాల్ట్
రాక్ ైక్లెంబింగ్ అంటే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది పాండవుల గుట్టలే. పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్న ఈ గుట్టలను 2017లో ఎకో టూరిజం శాఖ తన ఆధీనంలోకి తీసుకొని రాక్ ైక్లెంబింగ్, రాక్ఫెల్లింగ్, ట్రెక్కింగ్, హైకింగ్ వంటి విన్యాసాలను ప్రవేశపెట్టింది. దీనిపై ఎకో టూరిజం, అటవీశాఖ అధికారులు విస్తృత ప్రచారం కల్పించారు. అప్పుడు ఒకరిద్దరితో ప్రారంభమైన రాక్ైక్లెంబింగ్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి, డీఎఫ్‌వో అర్పన వంటి అధికారులు సైతం రాక్ైక్లెంబింగ్ చేసి యువతలో ఉత్సాహం నింపారు. నెలలో సుమారు 200 మందికిపైగా రాక్ైక్లెంబింగ్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేకంగా ఇందుకోసమే కొందరు పర్యాటకులు ఇక్కడి వస్తుండడం విశేషం. రాక్ైక్లెంబింగ్కు రుసుము రూ.400 వసూలు చేస్తున్నారు. సెలవు రోజులతో పాటు శని, ఆదివారాల్లో మాత్రమే రాక్ైక్లెంబింగ్, ట్రెక్కింగ్, హైకింగ్ వంటి విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు నైట్‌హాల్ట్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి బస చేసేందుకు గుడారాలు, బృంద చర్చల కోసం టేబుల్స్, కుర్చీలు, రాత్రి భోజనం, టీ, ఉదయం టిఫిన్, టీ వంటివి అందిస్తున్నారు. నైట్హాల్టింగ్, భోజనం, ట్రెక్కింగ్ కోసం ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున ఫీజు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్‌బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
- కందకుర్తి సరిహద్దులో ఇంజక్షన్ కలకలం