సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Jan 03, 2021 , 03:42:46

రెడ్‌క్రాస్‌ సేవలు అభినందనీయం

రెడ్‌క్రాస్‌ సేవలు అభినందనీయం

  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

కృష్ణకాలనీ, జనవరి 2 :  రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ భవన నిర్మాణ పనులను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గాయపడిన వ్యక్తు లకు రక్తం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలో రెడ్‌క్రాస్‌ సొసైటీ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా భవన నిర్మాణానికి అంబేద్కర్‌ సెంటర్‌లో 9గుంటల భూమిని కేటాయించినట్లు చెప్పారు. డీఎంఎఫ్‌టీ లేదా సీఎస్సార్‌ నుంచి నిధులతో వెంటనే భవనాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఆటో యూనియన్‌కు స్థలం కావాలని కార్మికులు కోరడంతో స్పందించిన ఎమ్మెల్యే అంబేద్కర్‌ కూడలి లో రూ.4 లక్షలతో భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధార్‌సింగ్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర ఈసీ మెంబర్‌ శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, సభ్యులు డాక్టర్‌ కిరణ్‌, కృష్ణమోహన్‌, రమేశ్‌, రామకృష్ణ, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కళ్లెపు శోభ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సెగ్గం వెంకటరాణీసిద్ధు, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌ కుమార్‌, మున్సిపల్‌ ఫ్ల్లోర్‌ లీడర్‌ గండ్ర హరీశ్‌రెడ్డి, ఎంపీపీ మందల లావణ్య, కౌన్సిలర్లు నూనె రాజు, పానుగంటి హారిక, శిరుప అనిల్‌, మాడ కమల,  ముంజంపల్లి మురళీధర్‌, ముంజాల రవీందర్‌, మంగళపల్లి తిరుపతి, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శి తాటి అశోక్‌, నాయకులు బుర్ర రమేశ్‌, రవీందర్‌రెడ్డి, బండారి రవి, మోకిడి అశోక్‌,  సేనాపతి, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ యూత్‌ అధ్యక్షులు రాజు, టీజేఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.   

VIDEOS

logo