బుధవారం 03 మార్చి 2021
Jayashankar - Jan 03, 2021 , 03:39:55

ప్రజలే నాకు దేవుళ్లు

ప్రజలే నాకు దేవుళ్లు

  • ‘పుట్ట లింగమ్మ’ ట్రస్టు సేవలు విస్తృతం చేస్తాం..
  • పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

కాటారం, జనవరి 2 : మంథని నియోజకవర్గ ప్రజలు నాకు దేవుళ్లతో సమానమని పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కాటారంలో ఉచిత వైకుంఠరథాన్ని శనివారం ఆయన భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీరాకేశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కాటారం మండలంతో పాటు చు ట్టుపక్కల మండలాల ప్రజలు సైతం ఈ వైకుంఠ రథంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల నుంచి గోదావరి వద్దకు తీసుకువెళ్లి అంత్యక్రియలు చేయ డం ఇబ్బందిగా మారడమే కాకుండా, వాహన సౌకర్యం లే క అంత్యక్రియలు ఆలస్యమై ఇబ్బందులు ఎదుర్కోవడం కనిపించిందన్నారు. ప్రజలకు తొలగించాలనే ఉద్దేశంతోనే పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా రథాన్ని అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ట్రస్టు సేవలు కొనసాగుతూ నే ఉంటాయన్నారు. ప్రజా సేవకే నా జీవితాన్ని అంకితం చేస్తున్నానన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీహర్షిణి మాట్లాడుతూ ట్రస్ట్‌ సేవలను మరింత విసృత్తం చేస్తున్న చైర్మన్‌ తులిసెగారి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సబ్‌ డివిజన్‌ పరిధిలోని ప్రజలు వైకుంఠరథం కోసం వాహనం ఇన్‌చార్జి సదానం దం 9010610451 నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అన్కారి భవానీప్రకాశ్‌, ఎంపీపీ బాన్సోడ రాణీబాయి, ఎంపీటీసీ తోట జనార్దన్‌, టీఆర్‌ఎస్‌ ఆయా మండల అధ్యక్షులు డోలి అర్జయ్య, మార్క రాముగౌడ్‌, లింగంపల్లి శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు రత్న సౌజన్య, ఎస్సీ సెల్‌ మంథని డివిజన్‌ అధ్యక్షుడు భూపెల్లి రాజు, రైతుబంధు సమితి అధ్యక్షుడు కుడుదుల రాజబాబు, నాయకులు మందల లక్ష్మారెడ్డి, జోడు శ్రీనివాస్‌, ఊర వెంకటేశ్వర్‌రావు, పంతకాని సడవలి, శ్రీలక్ష్మి, వెంకటస్వామి, బొడ్డు రాజబాపు, అనంతుల శ్రీనివాస్‌, శ్రీను, శంకర్‌, సత్యం, శ్రీనివాసరావు, జవ్వాజి తిరుపతి, దబ్బెట రాజేశ్‌, మందల రాజిరెడ్డి, వెంకటస్వామి, జోడు శ్రీనివాస్‌, కిరణ్‌, తాజొద్దీన్‌, మొగిలి, సుజాత, శ్రావణ్‌, రాజు, తదితరులు ఉన్నారు. 

కాటారం డీఎస్పీకి జడ్పీ చైర్మన్ల అభినందన

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవా పతకానికి కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌ ఎంపికవడంతో ఆయనను జడ్పీ చైర్మన్లు ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రజల జీవనశైలిలో మార్పు తీసుకువచ్చేందుకు పోలీస్‌ శాఖ తరపున చేస్తున్న సేవలను కొనియాడారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

మల్హర్‌ : మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా మంజూరైన చెక్కులను  జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు శనివారం తాడిచర్లలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేద కుటుంబాలకు వరమని తెలిపారు. మండలంలో పది మందికి రూ.2,33,500 చెక్కులు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుంకరి సత్యనారాయణ, సింగిల్‌విండో చైర్మన్‌ చెప్యాల రామారావు, జక్కు రాకేశ్‌, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు గొనె శ్రీనివాస్‌, సింగిల్‌ విండో డైరెక్టర్లు మ ల్క ప్రకాశ్‌, మల్క రాజేశ్వరావు, మాచెర్ల సురేశ్‌, సుంకు రాము, ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి, టీఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షుడు తాజొద్దీన్‌, యూత్‌ అధ్యక్షుడు జాగిరి హరీశ్‌, నాయకులు కోట రవి, రాజేశ్వర్‌రావు, బుడిది మల్లేశ్‌, గుమ్మడి రవి, సిద్ధుల ఓదెలు, అక్కపాక సమ్మయ్య, రాములు పాల్గొన్నారు.

VIDEOS

logo