సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Jan 03, 2021 , 03:32:41

పల్స్‌ పోలియోపై ప్రచారం చేయండి

పల్స్‌ పోలియోపై ప్రచారం చేయండి

కృష్ణకాలనీ, జనవరి 2 :  పల్స్‌ పోలియోపై ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడా టీచర్లు, ఆశ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని భూపాలపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి బొడ రవికుమార్‌నాయక్‌ అన్నారు. శనివారం పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలకు  పల్స్‌ పోలియో, కొవిడ్‌-19 వాక్సిన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుడు మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పకుండా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజయ్య,  శీతల్‌ సింగ్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo