కేఎల్పీ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలి

- రహదారిపై రద్దీతో ప్రమాదాలు
- సింగరేణి అధికారులను వేడుకుంటున్నకార్మికులు, ప్రజలు
భూపాలపల్లి, జనవరి 1 : సింగరేణి ఏరియాలోని కేఎల్పీ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు. గని అవసరాల నిమిత్తం సింగరేణి రోడ్డు వేయగా ప్రజా రవాణా సైతం పెరగడంతో రోజురోజుకూ రద్దీగా మారుతోంది. దీంతో తరుచూ ప్రమాదా లు జరుగుతున్నాయి. ఈ రహదారిపై ప్రయాణమంటేనే కార్మికులు, ప్రజలు భయపడిపోతున్నారు. గణపురం మండలం బస్వరాజుపల్లి సమీపంలో కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు (కేఎల్పీ) (ప్రస్తుత కేటీకే-8వ భూగర్భ గని)తవ్వకాన్ని సింగరేణి యాజమా న్యం 2003లో ప్రారంభించింది. కార్మికులు రావడానికి, బొగ్గు రవాణా కోసం భూపాలపల్లి-పరకాల జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సింగరేణి ఏరి యా దవాఖాన నుం చి కేఎల్పీ గని వరకు సంస్థ డబుల్ రోడ్డు వేసింది. ఈ రహదారి వరకు గణపురం, వెంకటాపూర్ మండలాల్లోని పలు గ్రామాల నుంచి ప్రభు త్వ నిధులతో బీటీ రోడ్లు వేసి అనుసంధానం చేశారు. ఇదే రహదారి సమీపంలో కార్మికుల నివాసార్థం సంస్థ యైటిైంక్లెయిన్ కాలనీ నిర్మించింది. కార్మికుల కుటుంబాలు పనుల నిమిత్తం భూపాలపల్లి, పరకాల, గణపురం, వెంకటాపూర్, ములుగుకు వెళ్లి రావాలన్నా ఈ రహదారిగుండానే వెళ్లాల్సి ఉంటుంది. వీరే కాకుండా ఆయా మండలాల ప్రజలు భూపాలపల్లికి ఈ రహదారిగుండానే వచ్చి, వెళ్తుంటారు. దీంతో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగి, రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందడంతోపాటు గాయాలపాలయ్యారని కేఎల్పీ కార్మికులు పేర్కొంటున్నారు. ఈ రహదారి సమీపంలో సింగరేణి యాజమాన్యం కార్మికుల నివాసార్థం నూతనంగా మరో 854 క్వార్టర్ల నిర్మాణం చేపట్టి వేగవంతంగా కొనసాగిస్తుంది. నూతనంగా కేటీకే ఓసీపీ-3 ఉపరితల గని తవ్వకాన్ని కొనసాగిస్తుంది. ఆ గనిలో విధులు నిర్వర్తించే కార్మికులు, బొగ్గును రవాణా చేసే టిప్పర్లు, లారీలు కేఎల్పీ రోడ్డు నుంచే వెళ్లి రావాల్సి ఉంటుంది. దీంతో కేఎల్పీ రహదారి మరింత రద్దీగా మారనుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని కార్మికులు, పరిసర గ్రామాల ప్రజలు సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నారు.
విధులకు వెళ్లి వస్తుంటే భయమేస్తుంది
ఇంతకుముందు ఈ రోడ్డులో రద్దీ పెద్దగా ఉండకపోయేది. ఇప్పుడు ములుగు, వెంకటాపూర్, గణపురం మండలాలకు చెందిన ప్రజలు భూపాలపల్లికి ఈ దారిగుండానే వచ్చి పోతున్నారు. వాహనాల రద్దీ చాలా పెరిగింది. కేఎల్పీ రోడ్డులో డ్యూటీకి వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఈ రోడ్డుపై ప్రమాదాలు చాలా జరిగాయి. కొందరైతే రోడ్డు ప్రమాదాన్ని చూసి రెండు మూడు రోజుల దాకా డ్యూటీకి రావడంలేదు. ఈ రోడ్డును మరింత పెద్దగా చేయాలి.
- తిరునహరి శివప్రసాద్, కోల్కట్టర్, కేటీకే-8వ గని
తాజావార్తలు
- క్రిప్టో కరెన్సీల్లో రికార్డు: బిట్ కాయిన్ 6% డౌన్.. ఎందుకో తెలుసా!
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో