శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 02, 2021 , 02:53:02

ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం

ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం

  • ఎస్పీ డాక్టర్‌ సంగ్రాం సింగ్‌ జీ పాటిల్‌

భూపాలపల్లి/ ములుగు, జనవరి 1 : నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో  ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఎస్పీ సంగ్రాం సింగ్‌ జీ పాటిల్‌ అన్నారు. నూతన సంవత్సర వేడుకలను జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి పోలీస్‌ శాఖ తరుపున  ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో నేర రహిత, ప్రమాదాల నివారణ, మహిళలకు భద్రత పీపుల్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలే లక్ష్యంగా సేవలందించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.  గత సంవత్సరం ములుగు జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా విధులు నిర్వహించి సేవా పురస్కారాలకు ఎంపికైన అధికారులకు అభినందనలు తెలిపి మిఠాయిలు తినిపించారు. వేడుకల్లో  అదనపు ఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్‌ ఎస్పీ సదానందరెడ్డి, శిక్షణ ఐపీఎస్‌ సధీర్‌రామ్‌నాథ్‌ కే ఖాన్‌, భూపాలపల్లి, కా టారం డీస్పీలు సంపత్‌రావు, కిషన్‌, సీఐలు, ఎస్సైలు, డీపీవో అధికారులు, సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన న్యూఇయర్‌ వేడుకల్లో ఎమ్మెల్యే సీతక్క స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం కార్యకర్తలకు న్యూఇయర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 


VIDEOS

logo