మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Jan 01, 2021 , 03:08:33

కల్వర్టులో కారు బోల్తా

కల్వర్టులో కారు బోల్తా

టేకుమట్ల, డిసెంబర్‌ 31 :  మండల కేంద్రంలోని చెరువు మత్తడి వద్ద నిర్మిస్తున్న కల్వర్టులో గురువారం  తెల్లవారుజామున  కారు బోల్తా పడిం ది. బాధితుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా బేగంపేటకు చెందిన సింగరేణి కార్మికుడు తొట్ల రాజు వారం రోజుల క్రితం కారులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వెళ్లి బుధవారం తిరుగు ప్రయనమయ్యాడు. ఈ క్రమంలో టేకుమట్ల చెరువు కట్ట వద్ద కల్వర్టు కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు కారు పడింది.  ఈ ప్రమాదంతో రాజు భార్య రాజమని, కుమారు అభినయ్‌, అత్త స్వరూప, బామ్మర్ది దిలీప్‌కు గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, కారులో ఉన్న వారిని బయటికి తీసి వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు తరలించారు.  


VIDEOS

logo