ఆదివారం 07 మార్చి 2021
Jayashankar - Jan 01, 2021 , 03:03:23

సేవా పతకాలకు

సేవా పతకాలకు

  • 13 మంది పోలీస్‌ అధికారుల ఎంపిక

భూపాలపల్లి రూరల్‌, డిసెంబర్‌ 31: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన 13 మంది పోలీస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తమ సేవా, కఠిన సేవా పతకాలను ప్రకటించినది. జిల్లా నుంచి  ఉత్తమ సేవా పతకాలకు భూపాలపల్లి డీఎస్పీ ఏ సంపత్‌రావు, కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌, మొగుళ్లపల్లి ఏఎస్సై ప్రసాద్‌,  డీసీఆర్డీ బీ సాంబయ్య ఉన్నారు. సేవా పతకానికి కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌, మహదేవపూర్‌ ఏఎస్సై చల్లా రాజన్న, భూపాలపల్లి కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, మొగుళ్లపల్లి కానిస్టేబుల్‌  వెంకటేశ్వర్లు, మహాముత్తారం ఏఎస్సై సుధాకర్‌ రెడ్డి, కానిస్టేబుల్‌ సతీశ్‌కుమార్‌ రెడ్డి ఉన్నారు.  కఠిన సేవా పతకానికి భూపాలపల్లి రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ డీ సంతోశ్‌కుమార్‌, పలిమెల కానిస్టేబుల్‌ డీ వినోద్‌బాబు ఎంపికయ్యారు. 

ములుగు జిల్లాలో.. 

ములుగు : ములుగు జిల్లా పరిధిలోని పోలీసు శాఖలో వివిధ విభాగల్లో ఉత్తమ సేవలందించిన 13మంది పోలీసు అధికారులకు ఉత్తమ సేవ, కఠిన సేవా, పోలీసు సేవ పతకాలను ప్రకటించారు. వారిలో గతంలో ఓఎస్డీగా పనిచేసిన సురేశ్‌కుమార్‌, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ సీహెచ్‌ కుమారస్వామి, సీఐలు అనుముల శ్రీనివాస్‌, శివప్రసాద్‌, నాగబాబు, ఎస్సైలు శ్రీకాంత్‌, తిరుపతి, కనకయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంద్రసేనారెడ్డి, ఎండీ రఫీ, ఎం రమేశ్‌, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, భిక్షపతి, ఉన్నారు. ఈ సందర్భంగా పతకాలకు ఎంపికైన వారికి ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ అభినందనలు తెలిపారు.


VIDEOS

logo