సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Dec 31, 2020 , 02:45:22

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

కాటారం : పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఉద్యాన అధికారి, మండల ప్రత్యేక అధికారి అక్బర్‌ సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక, సెగ్రిగేషన్‌షెడ్డు తదితర అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. పనుల్లో మరింత స్పీడ్‌ పెంచేందుకే అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు.  జీపీల్లో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని, 50 మంది కూలీలకంటే తక్కువ తగ్గకుండా ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలన్నారు. అలాగే ప్రతి శుక్రవారం అవెన్యూ ప్లాంటేషన్‌ కింద నాటిన మొక్కలకు వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా నీరు పట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో శంకర్‌, ఎంపీవో మల్లికార్జున్‌ రెడ్డి, ఏపీవో వెంకన్న, పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. 


VIDEOS

logo