తాలు తీయండిల !

- ప్యాడీ క్లీనర్‌తో సులభం
- ధాన్యం తూర్పారపట్టడానికి చెక్
- తరుగు ముప్పుండదు.. మద్దతు ధరకు ఢోకా ఉండదు
- ప్యాడీ క్లీనర్లను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం
- సంతోష పడుతున్న రైతులు
వడ్లలోని తాలు రైతులకు పెద్ద సమస్యగా మారింది. ధాన్యంలో తాలు, మట్టి పెళ్లలు, రాళ్లు ఉండడంతో కేంద్రాల్లో కొనుగోలు చేయరు. ఒకవేళ కొన్నా తాలు పేరిట క్వింటాల్‌కు నాలుగు నుంచి ఆరు కిలోల తరుగు తీస్తారు. దీంతో చాలామంది ఎడ్లబండిపైకి ఎక్కి తూర్పార పడుతుంటారు. మరికొందరు ఫ్యాన్లు, కూలర్లు, బుర్రు పంపులను, టేబుల్ ఫ్యాన్లను ఉపయోగించి వడ్ల నుంచి తాలును వేరు చేస్తారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్యాడీ క్లీనర్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో రైతులు సంతోష పడుతున్నారు.
- మహాముత్తారం
ప్రభుత్వం మార్కెట్ కమిటీ వారీగా ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేస్తున్నది. ఇవి రైతులకు ఎంతగానో దోహద పడుతున్నాయి. ప్యాడీ క్లీనర్‌తో రైతులు తక్కువ సమయంలో ఎక్కువ వడ్లలో తాలు లేకుండా చేస్తున్నది. దీంతో అన్నదాతలకు తరుగు ముప్పు లేకుండా, మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం కలిగింది.
- ప్యాడీ క్లీనర్ వల్ల లాభాలు
- రైతు గంటకు దాదాపు 20 క్వింటాళ్ల వరకు తాలును పూర్తి స్థాయిలో తొలగించవచ్చు.
- సాధరణంగా రైతులు వడ్లను తూర్పార పట్టాలంటే నలుగురు మనుషులు అవసరం. ఒక వేళ సాట వేస్తే 5 నుంచి 6 గురు తప్పనిసరి.
- ప్యాడీ క్లీనర్‌తో ఒక్క మహిళే వడ్ల నుంచి తాలును వేరు చేయవచ్చు.
- తూర్పార పడితే కూలీల ఖర్చు అధికం.
- గతంలో రైతులు సాటలను, పంకలతో తాలును వేరు చేసే సమయంలో ప్రమాదాలు జరిగేవి. ప్యాడీ క్లీనర్‌తో ప్రమాదాలు అస్సలే ఉండవు.
- తరుగు ముప్పు తప్పి, రైతుకు మద్దతు ధర వస్తుంది.
- ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యాడీ క్లీనర్‌తో రూపాయి ఖర్చు లేకుండా తాలును తొలగించుకోవచ్చు.
- గతంలో రైతులు రాత్రి పగలు కల్లంలోనే ఉండేవారు. ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు.
- అల్కగవుతుంది..
ఇదివరకు వడ్లను తూర్పార పట్టడం, సాట వేయడం చాల కష్టమయ్యేది. ఎకరం వడ్లలో తాలును తీయడానికి రెండు మూడు రోజులు పట్టేది. కొందరు పంకలు పెట్టి తూర్పార పడితే ఒక్కోసారి చేతికి దెబ్బలు తగిలేవి. ప్రభుత్వం ప్యాడీ క్లీనర్లను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంచడంతో తిప్పలు తప్పినయ్. గంటలో యంత్రంతో 20 క్వింటాళ్ల వడ్లను తాలును కంటికి కనిపించకుండా చేయవచ్చు.
- బొచ్చు కాటంరాజ్ రైతు,యామన్‌పల్లి
గంటలో తాలు మాయం
ఇదివరకు వడ్లలో మట్టి పెళ్లలు, తాలు, దుమ్ము ఉండే వడ్లను కొనడానికి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మస్తు సతాయించేది. దాంతో తక్కువ పైసలకే దళారులకు అమ్మేవారిమి. తాలును వేరు చేయడానికి ఎండలో మూడునాలుగు దినాలు కష్టపడేది. ఇప్పుడు చాలా అల్కగయింది.
- మాలోత్ శ్యామ్‌లాల్, రైతు, పోచంపల్లి
రైతుల మేలు కోసం ప్యాడీ క్లీనర్
ప్యాడీ క్లీనర్ సాయంతో రైతులకు తాలు సమస్య తీరింది. గతంలో రైతులకు ఎకరానికి రూ. 2000 వరకు ఖర్చు అయ్యేది. ప్యాడీ క్లీనర్‌తో రైతులకు పైసా ఖర్చు లేకుండా అయింది. రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉచితంగానే కల్లాల్లో ఏర్పాటు చేశాం. వడ్లలో తాలు సమస్య ఉండదు కాబట్టి రైతుకు మద్దతు ధర లభిస్తుంది.
- సోమ శాంతకుమార్, పీఏసీఎస్ చైర్మన్ మహాముత్తారం
తాజావార్తలు
- పూరీ తనయుడు మరింత రొమాంటిక్‌గా ఉన్నాడే..!
- ఎమ్మెల్సీ ప్రచారంలో దూసుకుపోతున్న సురభి వాణీదేవి
- కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర