సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Dec 29, 2020 , 02:22:12

పన్నుల వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌

పన్నుల వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌

  • జిల్లా వ్యాప్తంగా పన్నుల మొత్తం రూ.5,29,21,883
  • వసూలు చేసినవి రూ.2,30,16,161
  • వసూలు చేయాల్సినవి రూ.2,99,05,521
  • పన్నుల చెల్లింపులో 78.4 శాతంతో అగ్రస్థానంలో మహాముత్తారం,చివరి స్థానంలో రేగొండ 31.8 శాతం

జయశంకర్‌ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరానికిగ్రామ పంచాయతీల వారీగా యేటా వివిధ రకాల పన్నుల వసూలుకు జిల్లా పంచాయతీ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 241 గ్రామ పంచాయతీల పరిధిలో 2021 జనవరి నుంచి వన్నులు వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పలు రకాల నిధులతోపాటు జీపీలు పన్నుల రూపంలో వసూలు చేసే నిధులను సైతం అభివృద్ధికి పనులకు వినియోగించనున్నారు. జిల్లా వ్యాప్తంగా టాక్స్‌ పరిధి, నాన్‌ ట్యాక్స్‌ పరిధిలో మొత్తం రూ.5,29,21,883 పన్నులు ఉన్నాయి. ఇందులో పాత బకాయిలు రూ. 93,31,856 ఉన్నాయని, నూతనంగా  చెల్లించాలిన పన్నులు రూ. 4,35,90,027 ఉన్నాయని పంచాయతీ శాఖ అధికారులు తెలిపారు. బకాయిల నుంచి రూ.39,10,201 వసూలు చేశారు. నూతన పన్నుల నుంచి రూ.1,91,06,161 వసూలు చేశారు. జిల్లాలో మహాముత్తారం మండలం 78.4 శాతం పన్నులు చెల్లించి  ప్రథమ స్థానంలో నిలువగా రేగొండ మండలం 31.8 శాతం మాత్రమే పన్నులు చెల్లించి చివరి స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 43.5శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయి. 2021 జనవరి నుంచి పన్నుల వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టేందుకు అధికారులు కార్యాచరణను రూపొందిస్తున్నారు.


VIDEOS

logo