గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 29, 2020 , 02:22:15

వైభవంగా అయ్యప్ప పడిపూజ

వైభవంగా అయ్యప్ప పడిపూజ

కాటారం, డిసెంబర్‌ 28 : మండల కేంద్రంలోని శ్రీ ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి పడిపూజ వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపకుడు బచ్చు అశోక్‌ లలిత దంపతుల ఆధ్వర్యంలో పురోహితులు గురుస్వామి సింగనబట్ల నరహరి శర్మ వేద మంత్రోచ్ఛారణల మధ్య 18 మెట్ల పూజ కన్నుల పండువగా సాగింది. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అర్చకుడు గుండూరి భాను ప్రసా ద్‌ శర్మ, పురోహితులు నాగరాజు శర్మ, కృష్ణమోహన్‌ శర్మ, గణేశ్‌ శర్మ, గురుస్వామి శనిగరం రాంరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు బచ్చు ప్రకాశ్‌, కమిటీ ప్రతినిధులు రామకృష్ణారావు, నవీన్‌, ప్రభాకర్‌, జక్కు మొగిలి, చీమల రాజు, పెండ్యాల రంజిత్‌కుమార్‌, సంతోషం శ్రీనివాస్‌, లచ్చిరెడ్డి తదితరులున్నారు.

VIDEOS

logo