శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 27, 2020 , 02:18:52

వైభవంగా అయ్యప్ప ఆరట్టోత్సవం

వైభవంగా అయ్యప్ప ఆరట్టోత్సవం

  • త్రివేణి సంగమంలో ప్రత్యేక అభిషేకాలు

కాటారం, డిసెంబర్‌ 26 : ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆరట్టోత్సవం శనివారం వైభవంగా జరిగింది. అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాన్ని రథంలో మండల కేంద్రంలోని పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు, భక్తులు అయ్యప్ప స్వామికి మంగళహారతులతో నీరాజనం పలికారు. అనంతరం కాళేశ్వరానికి వెళ్లి పవిత్ర త్రివేణి సంగమంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు సీఏ చీర్ల రాజబాపు-గీత దంపతులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి భానుశర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు, గురుస్వాములు బచ్చు అశోక్‌, ప్రకాశ్‌, పీచర రామకృష్ణారావు, మద్ది నవీన్‌, బొమ్మ ప్రభాకర్‌, శ్రీనివాస్‌, చీమల రాజు, జక్కు మొగిలి, పెండ్యాల రంజిత్‌, లచ్చిరెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం, సురేశ్‌, శ్రావణ్‌, రామచంద్రం,  మాలధారులు పాల్గొన్నారు.

VIDEOS

logo