కరుణామయి కావ్యశ్రీ..!

భూపాలపల్లి : ప్రాణం ఉన్నప్పుడు తన ద్వారా మరొకరికి మంచి జరగాలను కోవ డం సహజం. కానీ, ప్రాణం పోయిన తర్వాత కూడా మరొకరికి తన ద్వారా మంచి జరగాలనుకోవడం మాత్రం గొప్ప విషయమే. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది భూపాలపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మెట్టు కావ్యశ్రీ. భూపాలపల్లి సింగరేణి దవాఖానలో వార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మెట్టు రాజనర్సు, భూలక్ష్మి దంపతుల కూతురు కావ్యశ్రీ హైదరాబాద్‌లోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. కరోనా సమయంలో భూపాలపల్లికి వచ్చిన ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా ఆవయవదానం చేయాలని నిర్ణయించుకున్నది. హైదరాబాద్‌లోని సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌ను ఆన్లైన్లో సంప్రదించగా వారు అందుకు సం బంధించిన పత్రాలను అందజేశారు. వెంటనే ఆమె అంగీకార పత్రంపై సంతకాలు చేసి ఫౌండేషన్‌కు పంపింది. దీంతో ఆమెకు ఐడీ కార్డు జారీ చేశారు. ఈ సందర్భంగా కావ్యశ్రీని సదాశయ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ కామిడి సతీశ్‌రెడ్డి అభినందించారు.
తాజావార్తలు
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్‌పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్