ఆదివారం 07 మార్చి 2021
Jayashankar - Dec 26, 2020 , 02:31:00

వైభంవంగా లక్ష్మీనారాయణుడి కల్యాణం

వైభంవంగా లక్ష్మీనారాయణుడి కల్యాణం

  • నాపాకలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

చిట్యాల, డిసెంబర్‌ 25 :  లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మండంలోని నాపాక లక్ష్మీనారాయణుడి కల్యాణం శుక్రవారం వేద పండితులు వైభవంగా జరిపించారు. అతిథులుగా హైదరాబాద్‌ రామకృష్ణ పరమహంస పీఠాధిపతులు శ్రీరామదాసు, నరేంద్రస్వామి అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల నడుమ వేద పండితులు ఆలయ ఆవరణలో స్వామివారి ఎదురుకోళ్లు, కల్యాణం నిర్వహించారు. ఈ వేడుకలను జడ్పీటీసీ గొర్రె సాగర్‌ ప్రారంభించారు. బండ్లు తిరుగుట, కోలాట భజనలతో ఉత్సవ మూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు గ్రామంలో  నిర్వహించారు. ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణ, గ్రామస్తులు  కల్యాణ మహోత్సవాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. వేడుకల్లో పూజారి పెండాల ప్రభాకరాచారి, ఆలయ కమిటీ చైర్మన్‌ బీరవోలు రాంరెడ్డి, సర్పంచ్‌ తొట్ల లక్ష్మీఐలయ్య, ఎంపీటీసీ కట్టెకోళ్ల రమేశ్‌, డైరెక్టర్లు పుష్పలీల, రజిత, సుదర్శన్‌, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo