గురువారం 04 మార్చి 2021
Jayashankar - Dec 26, 2020 , 02:30:44

లక్నవరానికి నయా లుక్‌

లక్నవరానికి నయా లుక్‌

  • పూర్తయిన జిప్‌ సైక్లింగ్‌ పనులు
  • ట్రయల్న్‌ సక్సెస్‌ 
  • రెండు రోజుల్లో అందుబాటులోకి  
  • నూతనంగా బోటు సైక్లింగ్‌ 

గోవిందరావుపేట : పర్యాటక ప్రాంతంగా ప్రకృతి ప్రేమికుల మనస్సు దోచుకుంటున్న లక్నవరం సరస్సు నయా హంగులతో పర్యాటకులను ఫిదా చేస్తున్నది. సరస్సు వద్ద ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన జిప్‌ సైక్లింగ్‌ పనులు పూర్తి కాగా, శుక్రవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. సక్సెస్‌ కావడంతో మరో రెండుమూడు రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తేనున్నారు. అంతేకాకుండా లక్నవరం సరస్సులో సైకిల్‌ తొక్కుతూ బోటు నడిపించేలా నూతనంగా సైక్లింగ్‌ బోటును ఏర్పాటు చేశారు. దీనిలో ఒక్కరే సైకిల్‌ తొక్కుతూ బోటులో 20 నిమిషాల పాటు సరస్సులో షికారు చేయొచ్చు. చార్జీ రూ.200లుగా నిర్ణయించారు. క్రిస్మస్‌ పండుగ నేపథ్యంలో శుక్రవారం లక్నవరం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. సుమారు 5వేల మంది సరస్సును సందర్శించినట్లు టూరిజం సిబ్బంది తెలిపారు. 

VIDEOS

logo