మంగళవారం 09 మార్చి 2021
Jayashankar - Dec 23, 2020 , 01:02:53

సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపీట

సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపీట

  • ఎమ్మెల్యే గండ్ర  వెంకటరమణారెడ్డి 

టేకుమట్ల/చిట్యాల, డిసెంబర్‌ 22 : కరోనాతో రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం ఎదురైనా సీఎం కేసీఆర్‌ రైతు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారె డ్డి అన్నారు. మంగళవారం ఆయన టేకుమట్ల, చిట్యాల మం డలాల్లో పర్యటించారు. టేకుమట్ల తహసీల్‌లో తహసీల్దార్‌ నరేశ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే 16 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. అనంతరం వెలిశాల, గుమ్మడవెల్లి గ్రామాల మధ్య చలివాగుపై రూ. 8.90 కోట్లతో నిర్మించనున్న చెక్‌ డ్యాం నిర్మాణ పనులకు శం కుస్థాపన చేశారు. చిట్యాల మండలం ఒడితల గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి సర్పంచ్‌ ఎర్రబెల్లి సాంబలక్ష్మిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఒడితల నుం చి పాశిగడ్డతండా వరకు రూ.40 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులు, దూత్‌పల్లిలో రూ.16 లక్షలతో నిర్మించనున్న జీపీ భవనానికి శంకుస్థాపన చేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా తీవ్రతలోనూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నదన్నారు. సన్న రకాలకు మద్దతు ధర కల్పించాలని బీజేపీ నాయకులు ధర్నాలు చేయడం అర్థరహితమన్నారు. బీజేపీ పాలిత రా ష్ర్టాల్లో ఎందుకు మద్దతు ధర కల్పిచడం లేదని ఎమ్మెల్యే గం డ్ర ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్‌  రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని, రైతులు గమనించాలని ఆయన కోరారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నారన్నారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌షెడ్లు, మన ఊరు మన నర్సరీలు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు పల్లెల ప్రగతికి చిహ్నాలుగా మారుతున్నాయన్నారు. ఈ కార్యక్రమాల్లో టేకుమట్ల తహసీల్దార్‌ చందా నరేశ్‌, ఎంపీడీవో చంఢీరాణి, ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ చింతలపల్లి విజయ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కత్తి సంపత్‌గౌడ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గునిగంటి మహేందర్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ ఐలయ్య, సర్పంచులు పోలాల సరోత్తంరెడ్డి, ఉమేందర్‌రావు, పండుగ శ్రీను, మహేశ్‌, రమారవీందర్‌, మహిపాల్‌రెడ్డి,  ఆది రఘు, గందం సారయ్య, తోట గట్టయ్య,  చిట్యాల ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్‌, వైస్‌ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, పీఏసీఎస్‌ చైర్మన్‌ క్రాంతికుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుంభం రవీందర్‌రెడ్డి, సర్పంచులు  పులి వెంకటేశ్‌, లావడ్య రజితాహరిభూషణ్‌, నాయకులు ఏరుగొండ గణపతి, మేర్గు నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo