సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Dec 23, 2020 , 01:02:58

మార్చిలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి

మార్చిలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి

  • కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య
  • అధికారులతో సమావేశం

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబర్‌ 22 : నాగారం క్లస్టర్‌లోని 19 గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ ప్రగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. భూపాలపల్లి మండలంలోని నాగారం క్లస్టర్‌లో రూర్బన్‌ మిషన్‌ ద్వారా రూ. 15 కోట్లను 19 గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ నిధుల నుంచి ఇప్పటికే వివిధ పనులను చేపట్టామని, మార్చిలోగా పనులన్నీ వంద శాతం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్డీవో శైలజ, పంచాయతీ రాజ్‌ ఈఈ రాంబాబు, రూర్బన్‌ మిషన్‌ డీపీఎం సింధూర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుధార్‌సింగ్‌, డీపీ వో సుధీర్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌ భాస్కర్‌, డీఈవో హైదర్‌ హై, ఉద్యానవన అధికారి అక్బర్‌, ఎంపీడీవో అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భూముల చుట్టూ ఫెన్సింగ్‌ వేయాలి

వక్ఫ్‌ బోర్డ్‌ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమశాఖ, రె వెన్యూ, సర్వేల్యాండ్‌, వక్ఫ్‌ బోర్డు అధికారులు, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వక్ఫ్‌ బోర్డు  అధికారులు మసీదులు, దర్గాలు, ఈద్గాల వివరాలు రికార్డు చేయాలన్నారు. భూముల చుట్టూ బండ్‌ ప్లాంటేషన్‌ చేయాలని, ప్రహరీ లేదా ఫెన్సింగ్‌ వేయాలన్నారు. ఆర్డీవో శ్రీనివాస్‌, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, వక్ఫ్‌బోర్డ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇలియాజ్‌ పాషా, అడ్వకేట్‌ రఫిక్‌ తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో సమావేశం

మల్హర్‌ : మండలంలోని తాడిచెర్ల గ్రామాన్ని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య మంగళవారం సందర్శించారు. మండల కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు వివిధ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలానికి 189 వరి కల్లాలు మంజూరయ్యాయన్నారు. కళాశాల ప్రహరీకి మరో రూ.5లక్షలు కావాలని ఎంపీపీ మల్హల్‌ రావు కలెక్టర్‌ను కోరారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రకాశ్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నా రు. మొదటిసారి మండలానికి వచ్చిన కలెక్టర్‌ను అధికారులు సన్మానించారు.

VIDEOS

logo