ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 23, 2020 , 01:02:58

ప్రజల కష్టాల్లోనూ పాలుపంచుకుంటాం

ప్రజల కష్టాల్లోనూ పాలుపంచుకుంటాం

  • జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి

కాటారం, డిసెంబర్‌ 22 : అభివృద్ధిలోనే కాదు.. ప్రజల కష్టాల్లో సైతం ప్రభుత్వం పాలు పంచుకుంటుందని జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీరాకేశ్‌ అ న్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు మండలంలో ప్రహరీలు, గుడిసెలు, ఇళ్లు కూలిపోయిన 125 మంది బాధితులకు ప్రభు త్వం నష్ట పరిహారం మంజూరు చేసింది. మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో మం గళవారం జడ్పీ చైర్‌పర్సన్‌ బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధిలోనే కాకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముం దుండి పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడన్నారు. భారీ వర్షా ల వల్ల నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. 3200 చొప్పున సాయమందించామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు దబ్బెట రాజేశం, జోడు శ్రీనివాస్‌ తదితరులున్నారు.

VIDEOS

logo