శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 22, 2020 , 01:55:24

‘డబుల్‌' స్పీడ్‌గా..

‘డబుల్‌' స్పీడ్‌గా..

  • గర్మిళ్లపల్లి- ఓడేడ్‌ గ్రామాల మధ్య డబుల్‌ రోడ్డు పనులు 
  • తీరనున్న ప్రజల ప్రయాణ కష్టాలు
  • పెరుగనున్న అంతర్‌ జిల్లాల సంబంధాలు

టేకుమట్ల, డిసెంబర్‌ 21 : మండలంలోని గర్మిళ్లపల్లి- పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్‌ గ్రామాల మధ్య డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. భూపాలపల్లి  ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గత నెల ( నవంబర్‌) 3న సర్పంచ్‌ నల్లబెల్లి రమారవీందర్‌ అధ్యక్షతన రూ. 5.60కోట్ల నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ప్రారంభమైన పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఇప్పటి వరకు మొరంతో పాటు, కంకర యాష్‌ పోసి రోలర్‌తో రోడ్డును చదును చేయించారు. కల్వర్టుల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ రోడ్డు పూర్తయితే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి టేకుమట్ల మీదుగా భూపాలపల్లి, వరంగల్‌, రూరల్‌, అర్బన్‌ జిల్లాలకు రవాణా  సౌక ర్యం పెరుగనుంది. దీంతో టేకుమట్ల మండల కేంద్రంతో పా టు, వెలిశాల, గర్మిళ్లపల్లి  గ్రామాలు కూడా వ్యాపార పరంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. వంతెన పనులు అగిపోవడంతో వాగులో తాత్కాలిక రోడ్డు నిర్మిస్తున్నారు. ఇది కూడా పూర్తయితే టేకుమట్ల మండలం పెద్దపల్లి, కరీంనగర్‌, మంచిర్యాల, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌, భూపాలపల్లి జిల్లాల ప్రజల ప్రయాణాలకు కేంద్ర బిందువు కానుంది. 

VIDEOS

logo