కల్లాల నిర్మాణాల్లో వేగం పెంచాలి

- కలెక్టర్ కృష్ణ ఆదిత్య
భూపాలపల్లి కలెక్టరేట్, డిసెంబర్ 21: కల్లాల నిర్మాణాలు వేగంగా జరిగేలా వ్యసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అ న్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు నేరు గా పర్యవేక్షిస్తే పనులు త్వరగా పూర్తవుతాయన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు వీలు కల్పించు కొని గ్రామాల్లో పర్యటించాలన్నారు. మొక్కలను నర్సరీల్లో అభివృద్ధి చేసి హరితహారం కార్యక్రమం నాటికి సిద్ధం చేయాలన్నారు. సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు అందుబాటులోలేని గ్రామాల్లో ప్రత్యామ్నాయ స్థలాలను అందించేందుకు ఆర్డీవో సహకారంతో సంబంధిత మండల ప్రత్యేక అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని శాఖలు ఈ-ఆఫీస్ ద్వారా పాలనా కార్యక్రమాలను కొనసాగించాలని ఆదేశించారు.
ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి వివిధ సమ స్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక వేళ మీ పరిధిలో పరిష్కారం కాని సమస్య అయితే సంబంధి త అర్జీదారులకు తెలిసేలా సమాచారం అందించాల న్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేశ్‌బాబు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రష్మీ హాట్ అందాలకు యువత దాసోహం
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు