సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Dec 22, 2020 , 01:52:18

మెయిన్‌ చెక్‌పోస్టును ప్రారంభించిన జీఎం

మెయిన్‌ చెక్‌పోస్టును ప్రారంభించిన జీఎం

భూపాలపల్లి : భూపాలపల్లి సింగరేణి ఏరియా కేటీకే-5వ గని వద్ద నూతనంగా నిర్మించిన మెయి న్‌ చెక్‌పోస్టును సోమవారం సాయంత్రం ఏరియా సింగరేణి జీఎం నిరీక్షణ్‌రాజ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీకే-8వ గని మినహా ఏరియాలోని అన్ని గనుల నుంచి బొగ్గు రవాణా చేసే లారీలు, టిప్పర్లు ఈ చెక్‌పోస్టు నుంచే వెళ్తాయన్నారు. వాటిని గమనించడానికి  చెక్‌పోస్టులో ఆధునాతన ట్రాకింగ్‌ సిస్టంను ఏర్పా టు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా సీసీ కెమెరాలు కూడా అమర్చినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా ఎస్‌వోటూ జీఎం విజయప్రసాద్‌, కేటీకే-1వ గ్రూప్‌ ఆఫ్‌ మైన్స్‌ ఏజెంట్‌ బీవీ రమణ, డీజీఎం(పర్సనల్‌)మంచాల శ్రీనివాస్‌, డీజీఎం(సివిల్‌) కే సత్యనారాయణ, ఏరియా సీనియర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఎండీ షరీఫ్‌, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజలింగు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo