Jayashankar
- Dec 20, 2020 , 02:22:49
VIDEOS
కాళేశ్వరంలో దోష నివారణ పూజలు

కాళేశ్వరం, డిసెంబర్ 19 : శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు కాలసర్ప, శని దోష నివారణ పూజలు చేశా రు. ముందుగా త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకుని నవగ్రహ విగ్రహాల వద్ద పూజలు చేశారు. అనంతరం సుబ్రమణ్యస్వామి ఆలయ ఆవరణలో కాలసర్ప దోష నివారణ పూజలు చేశారు. అలాగే కాళేశ్వర ముక్త్తీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పార్వతి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి వారి ఆలయంలో నేడు సుబ్రమణ్య షష్ఠి సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు షష్ఠి పూజలు చేయనున్నట్లు ఈవో మారుతి తెలిపారు.
తాజావార్తలు
MOST READ
TRENDING