ప్రాచీన కళలపై అవగాహన కల్పించేందుకే ‘ఉత్సవ్'

భూపాలపల్లి కలెక్టరేట్, డిసెంబర్ 18: ప్రాచీన భారతీయ కళలను విద్యార్థులకు తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్-2020 కార్యక్రమాన్ని నిర్వహిస్తుదని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హై తెలిపారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆన్లైన్లో చివరి రోజు నిర్వహించిన ఉత్సవాలకు జిల్లా విద్యాశాఖ అధికారి హాజరై మాట్లాడారు. కళా ఉత్సవాలు చివరి రోజులో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పలిమెల పి.పూజిత, పి.జ్యోతి ఇండిజీనియస్ గేమ్స్ బాలికల విభాగంలో, జడ్పీహెచ్ఎస్ కాటారం ఏ.కిరణ్, డీ.అంజన్ కుమార్ బాలుర విభాగంలో వామన గుంటలు, చిర్రగోనె ఆటలతో తమ క్రీడా నైపుణ్యాన్ని ఆన్లైన్లో ప్రదర్శించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈకార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రాచీన కళలపై అవగాహన పెరుగుతుందని, ప్రాచీన భారతీయ కళలు మానవ జీవితానికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి మువ్వ హరికృష్ణ, జీసీడీవో శిఖరజనీవందన, కుసుమ కృష్ణమోహన్, కనకలక్ష్మి పాల్గొన్నారు.
తాజావార్తలు
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్