బుధవారం 03 మార్చి 2021
Jayashankar - Dec 18, 2020 , 01:10:08

ఉపాధి రుణాలపై సదస్సులు నిర్వహించండి

ఉపాధి రుణాలపై సదస్సులు నిర్వహించండి

  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబర్‌ 17: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రు ణాలపై అవగాహన కలిగేలా సదస్సులు నిర్వహించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావే శం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జేసీ కూరాకుల స్వర్ణలతతో కలిసి జిల్లాలో ఆర్థిక అభివృద్ధికి బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.

అ నంతరం నాబార్డ్‌ రూ.874.54 కోట్లతో రూ పొందించిన 2021-2022 వార్షిక రుణ ప్ర ణాళిక బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ యువత, రైతులు, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన అనేక పథకాలను ప్రవేశపెట్టిందని బ్యాంకర్లు ప్రభుత్వ సంకల్పానికి తోడ్పాటు అందిం చాలన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణా లు సకాలంలో అందించాలని, ప్రతి బ్యాం కులో వివిధ రుణాలకు సంబంధించిన వివరాలను బోర్డు ద్వారా ప్రదర్శించాలన్నారు. ఉపాధి పొందేలా యువతకు రుణాలను అందించాలని, స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. జేసీ స్వర్ణలత మాట్లాడుతూ వానకాలం, యా సంగి పంట సీజన్‌లో నిర్దేశించిన పంట రుణాలను సాధించడంలో బ్యాంకర్లు వెనుకబడి ఉన్నారని, ఇప్పటి నుంచి పంట రుణాలను లక్ష్యం మేరకు అందించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు విద్యా రుణాలు, గృహ నిర్మాణ రుణాలు అత్యధికంగా అందించాలని, ప్రభుత్వ పథకాలైన ముద్ర రుణాలు, స్ట్రీట్‌ వెండర్స్‌ రుణాలను నిర్దేశిత లక్ష్యం మేరకు అందించాలని అన్నా రు. అనంతరం ఈ నెలలో  ఉద్యోగ విరమ ణ పొందుతున్న నాబార్డ్‌ ఏజీఎం కృష్ణమూర్తిని సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ కళ్లెపు శోభ, భూపాలపల్లి మున్సిపల్‌  చైర్‌ పర్సన్‌ సెగ్గెం వెంకటరాణి, ఎల్డీఎం శ్రీనివాస్‌, బ్యాంకర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


VIDEOS

logo