ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 18, 2020 , 01:10:31

ట్రాక్టర్‌ పై నుంచి కింద పడి ఒకరి మృతి

ట్రాక్టర్‌ పై నుంచి కింద పడి ఒకరి మృతి

చిట్యాల: ట్రాక్టర్‌పై నుంచి కిందపడి సింగరవేణి రవి(32) అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన  కాల్వపల్లి గ్రామ శివారు మానేరు వాగు వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన సింగరవేణి రవి వ్యవసాయంతోపాటు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సుంకరి ప్రశాంత్‌రెడ్డి తన ట్రాక్టర్‌ డ్రైవర్‌గా రావాలని రనిని ఫోన్‌లో సంప్రదిస్తాడు.


ఈ క్రమంలో రవితోపాటు అదే గ్రామానికి చెందిన పొన్నం రాకేశ్‌, రాజు, జంగేటి కార్తీక్‌ రాత్రిపూట కాల్వపల్లి మానేరు వాగు వద్దకు చేరుకొని, ఇసుకను లోడ్‌ చేసి తరలిస్తుండగా, రవి ట్రాక్టర్‌పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన తోటిమిత్రులు రవి మృతదేహాన్ని ఆయన ఇంటి ఎదుట వేసి వెళ్లిపోయారు. గురువారం ఉదయం అతడి భార్య ఇంటి ఎదుట ఉన్న భర్త మృతదేహాన్ని చూసి కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి జరిగిన విషయంపై ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు ప్రశాంత్‌రెడ్డి, రాకేశ్‌, రాజు, కార్తీక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

VIDEOS

logo