గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 17, 2020 , 01:56:15

భూపాలపల్లి తహసీల్‌లో ప్రథమ మార్టిగేజ్‌

భూపాలపల్లి తహసీల్‌లో ప్రథమ మార్టిగేజ్‌

భూపాలపల్లి, డిసెంబర్‌ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులకు ఎంతో మేలు జరుగుతు న్నది. బుధవారం ధరణి ద్వారా భూపాలపల్లి తహసీల్‌లో తొలిసారి మార్టిగేజ్‌ ప్రక్రియను చేపట్టి పూర్తి చేశారు. వివరాల్లోకి వెళ్లితే భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామానికి చెందిన కౌటం మల్లయ్య డెయిరీ ఫాం పెట్టుకోవడానికి  రూ. 8,79, 500 దీర్ఘకాలిక రుణం కోసం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు భూపాలపల్లి బ్రాంచిలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు బ్యాంక్‌ అధికారులు అంగీకరించారు. ఇందుకోసం సదరు బ్యాంక్‌కు  ఇదే మండలంలోని వజినపల్లి శివారులో తన పేర ఉన్న వ్యవసాయ భూమి 3.12 ఎకరాలను  తనాఖా పెట్టాడు. దీనికి సంబంధించిన మార్టిగేజ్‌ ప్రక్రియను భూపాలపల్లి తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ అశోక్‌కుమార్‌  పూర్తి చేసి పత్రాలను డీసీబీబీ భూపాలపల్లి బ్రాంచి మేనేజర్‌ ఇంజంపెల్లి తిరుపతికి అందజేశారు. 

VIDEOS

logo