శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 17, 2020 , 01:42:25

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరాణీసిద్ధు

భూపాలపల్లి టౌన్‌, డిసెంబర్‌ 16: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణీసిద్ధు కోరారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లిలో పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌కుమార్‌ యాదవ్‌ అధ్యక్షతన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్‌పర్సన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింన్నారు. దళారులను నమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, వార్డు కౌన్సిలర్‌ మంగళంపల్లి తిరుపతి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పులి వేణుగోపాల్‌, టీఆర్‌ఎస్‌ 12వ వార్డు అధ్యక్షుడు బిల్లా అశోక్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు పోలవేని అశోక్‌ యాదవ్‌, బిల్లా సురేందర్‌రెడ్డి, పొనుగోటి రమేశ్‌, బౌతు రమేశ్‌, జనగాం శ్రీనివాస్‌, యూత్‌ నాయకులు పోలవేని మహేందర్‌, రైతు బంధు సమితి నాయకుడు సల్ల లింగయ్య, రవీందర్‌రెడ్డి, మేకల రాజయ్య, సోమారపు మల్లయ్య, జనగాం రాజయ్య, జోరు నర్సయ్య, బద్ది పోచయ్య, పీఏసీఎస్‌ సీఈవో సల్ల రవీందర్‌, ఇన్‌చార్జి కాటం సురేశ్‌, రైతులు పాల్గొన్నారు.

VIDEOS

logo