శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 16, 2020 , 02:04:29

229.22 ఎకరాల భూసేకరణ ముఖాముఖి చర్చలు

229.22 ఎకరాల  భూసేకరణ ముఖాముఖి చర్చలు

భూపాలపల్లి : భూపాలపల్లి సింగరేణి ఏరియా కేటీకే ఓసీపీ-3 గనికి అవసరమైన భూ సేకరణ  నిమిత్తం మంగళవారం కేటీకే ఓసీపీ -3 గని వద్ద కార్యాలయంలో గణపురం మండలం  పరుషురాంపల్లి గ్రామ రైతులతో ముఖాముఖి చర్చలు జరిపినట్లు భూపాలపల్లి సింగరేణి ఏరియా అధికార ప్రతినిధి శ్రీనివాస్‌ తెలిపారు. భూసేకరణ అధీకృత అధికారి వద్ద ఉన్న  కేసు పరిష్కారానికై సింగరేణి యాజమాన్యం ఆ రైతులతో చర్చలు జరిపిందన్నారు. 229.22 ఎకరాల భూమి విషయమై చర్చలు జరుపగా గతంలో ఇదే గని కింద  తీసుకున్న 411 ఎకరాల భూ సేకరణలో నష్ట పరిహారం ఇచ్చినట్లుగానే  ఇవ్వాలని రైతులు కోరారు. సింగరేణి తరుపున కార్పొరేట్‌ అధికారి జీఎం(ఎస్టేట్‌)ఎస్‌డీఎం సుభానీ మాట్లాడుతూ ఎల్‌ఏ అథారిటీ నందు ైక్లెమ్‌ పటిషన్‌  ఈ నెల 23న వేసుకోవాలని రైతులకు సూచించారు. చర్చలు ఫలప్రదమయ్యాయని తెలిపారు. చర్చలలో ఏరియా జీఎం నిరీక్షణ్‌రాజ్‌, అధికారులు ఐలయ్య, రామదాస్‌, శివకుమార్‌, రైతులు పాల్గొన్నారు.


VIDEOS

logo