సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Dec 15, 2020 , 03:57:24

ఓసీ 3ని తనిఖీ చేసిన సింగరేణి డైరెక్టర్‌

ఓసీ 3ని తనిఖీ చేసిన సింగరేణి డైరెక్టర్‌

భూపాలపల్లి, డిసెంబర్‌ 14: భూపాలపల్లి ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓసీ 3 ప్రాజెక్టును సింగరేణి డైరెక్టర్‌ (పీపీ, ఫైనాన్స్‌) ఎన్‌ బలరాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం రెండో షిప్టులో ఓసీ 3 లో ఆకస్మికంగా తనిఖీ చేసి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ, యంత్రాల పనితీరున పరిశీలించారు. ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించి ఉత్పత్తి విషయంలో మార్పులు తీసుకురాకపోతే భూపాలపల్లి ఏరియా భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారుతుందని గుర్తు చేశారు. ఆయన వెంట జీఎం నిరీక్షణ్‌రాజ్‌, పీవో రఘుపతి, ఓసీ 3 మేనేజర్‌ భాను తదితరులున్నారు.  


VIDEOS

logo