బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 13, 2020 , 05:52:05

సీసీ టీవీల కొరతపై సమాచారమివ్వాలి

సీసీ టీవీల కొరతపై సమాచారమివ్వాలి

  • జీఎం (సెక్యూరిటీ) కుమార్‌రెడ్డి

భూపాలపల్లి : సీసీ టీవీల కొరత ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని జీఎం (సెక్యూరిటీ) ఏ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని ఏరియాల సెక్యూరిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అన్ని ఏరియాల ఎస్‌అండ్‌పీసీ మ్యాన్‌ పవర్‌ జాబితా, పెండింగ్‌ కేసులు, ఇంటెలిజెన్స్‌, మొబైల్‌ టాస్క్‌ ఫోర్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగుల నైపుణ్యాలను తెలుసుకుని సూచనలు చేశారు. అలాగే ఆయా ఏరియాల్లోని గనులు, డిపార్ట్‌మెంట్లలో అమర్చిన సీసీ కెమెరాలను ఎలా పరిశీలిస్తున్నారనే విషయాలు, డీజిల్‌ బంకుల్లో  అవలంబిస్తున్న తీరును తెలుసుకున్నారు. సెక్యూరిటీ పోస్టుల వద్ద ఉద్యోగులు పాటించాల్సిన నిబంధనలను వివరించారు. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ను పాటిస్తున్నారా లేదా అనే విషయాలను తెలుసుకున్నారు. జీఎం ఈసీహెచ్‌ నిరీక్షణ్‌రాజ్‌, ఏరియా అధికార ప్రతినిధి మంచాల శ్రీనివాస్‌, అన్ని ఏరియాల సీనియర్‌  సెక్యూరిటీ అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo