మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Dec 10, 2020 , 05:55:52

మరోసారి మెరిసిన గంగారం

మరోసారి మెరిసిన గంగారం

  • జాతీయ పంచాయతీ అవార్డు-2021కు అర్హత

భూపాలపల్లి కలెక్టరేట్‌ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గంగారం గ్రామపంచాయతీ జాతీయ పంచాయతీ అవార్డు-2021కు అర్హత సాధించినట్లు డీపీవో సుధీర్‌కుమార్‌ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రతినెల మంజూరుచేసే నిధులను సక్రమంగా వినియోగించుకొని ప్రగతిబాట పడుతున్న జీపీలను ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేస్తారు. జిల్లాలో 241 గ్రామ పంచాయతీలకు గాను 13 జీపీలు ఈ అవార్డు కోసం దరఖాస్తు చేయగా కేంద్ర ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న గంగారం గ్రామ పంచాయతీని జాతీయ పంచాయతీ అవార్డుకు ఎంపిక చేసిందని డీపీవో చెప్పారు. వరుసగా జాతీయ అవార్డులతో గంగారం మెరిసిపోతోంది. 2018-19 సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి పనులకు గాను గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) అవార్డుతో పాటు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ్‌ అవార్డులు సాధించింది.


VIDEOS

logo