ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 09, 2020 , 03:51:40

కలెక్టర్‌కు థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్ల అందజేత

కలెక్టర్‌కు థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్ల అందజేత

భూపాలపల్లి కలెక్టరేట్‌ : హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ కంపెనీ ప్రతినిధులు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యకు కొవిడ్‌ బారిన పడిన వారిని సులభంగా గుర్తించేందుకు బాడీ టెంపరేచర్‌ను కొలిచే 2 థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్లను మంగళవారం అందజేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కలెక్టర్‌గా తాను కోరిన వెంటనే లక్షలాది రూపాయల విలువైన మిషన్లను అందించినందుకు ఈసీఐఎల్‌ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. నీతి అయోగ్‌ అత్యంత వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధికి భవిష్యత్‌లో మరింత సహకారం అందిచాలన్నారు. ఇందులో ఒక మిషన్‌ను ములుగు జిల్లా దవాఖానలో ఏర్పాటు చేస్తామని, మరొకటి ఎక్కడ ఏర్పాటు చేయాలనేది త్వరలో నిర్ణయిస్తామన్నా రు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్‌ కంపెనీ పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ హెడ్‌ ఆసిఫ్‌ ఉల్లాబేగ్‌, సీఎస్‌ఆర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ సునిల్‌కుమార్‌, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ మఖాన్‌దార్‌, నీతి అయోగ్‌ డిస్ట్రిక్‌ కో ఆర్డినేటర్‌ రాహుల్‌, డీపీఆర్వో రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo