శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Dec 09, 2020 , 03:51:38

భారత్‌ బంద్‌ విజయవంతం

భారత్‌ బంద్‌ విజయవంతం

  • ర్యాలీలు, రాస్తారోకోలు
  • స్వచ్ఛందంగా మూసిన వ్యాపారస్తులు

భూపాలపల్లి : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీలు, ధర్నాలు నిర్వహిచారు. భారత్‌ బంద్‌కు పలు సింగరేణి కార్మిక సంఘాలు తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూతో పాటు తదితర కార్మిక సంఘాల నాయకులు జిల్లా కేంద్రంలో ఆయా పార్టీలు నిర్వహించిన ర్యాలీలు, ధర్నాలు,  రాస్తారోకోలు, అర్ధనగ్న ప్రదర్శనలో పాల్గొన్నారు.  టీబీజీకేఎస్‌ నేతలు కొక్కుల తిరుపతి, బడితల సమ్మయ్య, రాజిరెడ్డి, కనకయ్య, సమ్మిరెడ్డి, రఘోత్తంరెడ్డి, కొచ్చర్ల రవికుమార్‌, గాజే సాంబయ్య, బాసనపల్లి కుమారస్వామి, ఏఐటీయూసీ నాయకులు కొరిమి రాజ్‌కుమార్‌, మోటపల్కుల రమేశ్‌, సీఐటీయూ నాయకులు బందు సాయిలు, కంపెటి రాజయ్య, రామస్వామి, ఐఎన్‌టీయూసీ నాయకులు పసునూటి రాజేందర్‌, జోగ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో..

కృష్ణకాలనీ :  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు బందు సాయిలు, కొరిమి రాజ్‌కుమార్‌, ఏఐఎఫ్‌బీ నాయకులు గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్‌ నాయకులు దేవన్‌ అన్నారు. మంగళవారం భారత్‌ బంద్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ధర్నా ని ర్వహించారు. సీపీఎం, ఏఐఎఫ్‌బీ నాయకులు మెడలకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోటపలుకుల రమేశ్‌, మల్లెల లక్ష్మణ్‌, అంబాల నివాస్‌, రాంనేని రవీందర్‌, బుర్ర కొమురయ్య, కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్‌, ఉడుత సరోజన అయిలయ్య, రజితాశ్రీనివాస్‌,  భూక్యా సమ్మయ్య,  శ్రీమదం సుధాకర్‌, పిప్పాల రాజేందర్‌, తోట రంజిత్‌ మహేందర్‌, రజినీకాంత్‌, అహ్మద్‌, రాజేశ్‌, రాకేశ్‌, వీ రాజయ్య, ఎన్‌ అరవింద్‌, అహ్మద్‌, మహేందర్‌, రాజు, జంపయ్య, ఐన్‌టీయూసీ నాయకులు రాజేందర్‌, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

 గణపురం మండలంలో..

గణపురం : మండల టీఆర్‌ఎస్‌ నాయకులు రైతులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. మండల కేంద్రం ర్యాలీని నిర్వహించారు. చెల్పూరు ప్రధాన రహదారిపై టీఆర్‌ఎస్‌ నాయకులు బైఠాయించారు. కర్కపల్లి, గాంధీనగర్‌, మైలారం, ల క్ష్మారెడ్డిపల్లి, గణపురం, అప్పయ్యపల్లి, సీతారాంపురం, కొం డాపూర్‌ గ్రామాల రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద సం ఖ్యలో బంద్‌కు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నారగాని దేవేందర్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ పోతర్ల అశోక్‌యాదవ్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతిగౌడ్‌, ముదిరాజ్‌ మహాసభ మండల అధ్యక్షుడు బోయిని సాంబయ్య, కుమారస్వామి, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మహదేవపూర్‌, కాటారం మండలాల్లో.. 

మహదేవపూర్‌ : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మహదేవపూర్‌, కాటారం మండలాల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వేర్వేరుగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేసి భారత్‌ బంద్‌కు మ ద్దతుగా దుకాణాలు బంద్‌ చేయించారు. అలాగే ఆయా మం డలాల్లో రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో మహదేవపూర్‌ ఎంపీపీ బన్సోడ రాణీబాయి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సల్ల తిరుపతయ్య, సర్పంచ్‌ శ్రీపతిబాపు, టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు ఎండీ అలీంఖాన్‌, మహిళా అధ్యక్షురాలు అన్నమనేని అరుణ, కాటారం మండ ల అధ్యక్షుడు డోలి అర్జయ్య, ఎంపీటీసీ తోట జనార్దన్‌,  నా యకులు దబ్బెట రాజేశ్‌, మంతెన చిరంజీవి పాల్గొన్నారు.

టేకుమట్ల మండలంలో..

టేకుమట్ల  : బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా  మంగళవారం  రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌లో టీఆర్‌ఎస్‌, కాంగ్రె స్‌,  సీపీఐ(ఎంఎల్‌) ఎమ్మార్పీఎస్‌ (టీఎస్‌), కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి  నాయకులు మండల కేంద్రంలో ర్యాలీ, ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కత్తి సంపత్‌ గౌడ్‌, రైతు బంధు మండల కో ఆర్డినేటర్‌ కూర సురేందర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గునిగంటి మహేందర్‌గౌడ్‌, సర్పంచులు సరోత్తంరెడ్డి, శ్రీను, మహేశ్‌, ఉమేందర్‌రావు, ఆది రఘు, సారయ్య, స్వామీరావు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కోటగిరి సతీశ్‌గౌడ్‌, జిల్లా కార్యదర్శి రవీందర్‌, యూత్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌ సీపీఐ(ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి మారెపల్లి మల్లేశ్‌,  సకినాల మల్లయ్య, ఎమ్మార్పీఎస్‌(టీఎస్‌) మండల అధ్యక్షుడు రేణుకుంట్ల రాము,  కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు జగన్‌ తదితరులు పాల్గొన్నారు.  

చిట్యాల మండలంలో..

చిట్యాల : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో మం గళవారం బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. టీఆర్‌ఎస్‌ మండ ల అధ్యక్షుడు కుంభం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి మల్లయ్య ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మం డల కేంద్రంలో సీపీఎం మండల ప్రధాన కార్యదర్శి సకినాల మల్లయ్య, ఏఐఎఫ్‌బీ జిల్లా నాయకుడు మధువంశీకృష్ణ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు తిరుపతి బంద్‌లో పాల్గొన్నారు. 

కాళేశ్వరంలో రాస్తారోకో 

కాళేశ్వరం : మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో జాతీయ రాహదారిపై ఎంపీటీసీ మమత, సర్పంచ్‌ వసంత ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పవన్‌, ఆలయ మాజీ చైర్మన్‌ రాంనారాయణ, నాయకులు సుల్తాన్‌, ఇమ్రాన్‌, బాపు, ఆనంద్‌, రాజు, మహేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

మల్హర్‌ మండలంలో..

మల్హర్‌ : రైతులకు మద్దతుగా మండలంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ సందర్భంగా మండల టీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్‌ శక్తులకు లబ్ధి చేకూర్చడం కోసమే బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందన్నారు.  

మొగుళ్లపల్లి మండలంలో..

మొగుళ్లపల్లి :  మండలంలోని అన్ని గ్రామాల్లో వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎఐఎఫ్‌బీ నాయకులు ర్యాలీలు, ధర్నాలు చేశారు.  ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాతాసంజీవరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంపెల్లి నర్సింగరావు, సర్పంచ్‌ మోటె ధర్మారావు, ఎంపీటీసీ ఎర్రబెల్లి వనితాపున్నంచందర్‌రావు, సర్పంచుల, ఎంపీటీసీలు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.


VIDEOS

logo