మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Dec 08, 2020 , 03:39:29

పెద్దపులుల ఆవాసానికి ప్రత్యేక చర్యలు

పెద్దపులుల ఆవాసానికి ప్రత్యేక చర్యలు

  • పోడు చేస్తే సహించేది లేదు
  •  వరంగల్‌ సీసీఎఫ్‌ ఎమ్‌జే అక్బర్‌ 

భూపాలపల్లి : పెద్దపులులు వరంగల్‌ ఉమ్మ డి జిల్లాలోని అడవులకు రావచ్చని, వాటి ఆవాసానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు వరంగల్‌ సర్కిల్‌ సీసీఎఫ్‌ ఎంజే అక్బర్‌ తెలిపారు. సోమవారం చెల్పూరు, భూపాలపల్లి అటవీ రేంజ్‌ పరిధిలోని ప్లాంటేషన్లు, నర్సరీలను సం దర్శించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అటవీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దపులుల ఆవాసానికి అవసరమైన వసతులు చేపట్టామన్నారు.

పులుల ఆహారానికి అవసరమైన వన్యప్రాణుల వృద్ధికి విరివిరిగా గడ్డి క్షేత్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. గతంలో కంటే ప్రస్తుతం అడవుల్లో మెకా లు, దుప్పులు, జింకలు, కొండగొర్రెలు, అడవి దున్నలు తదితర వన్యప్రాణి సంపద గణనీయంగా వృద్ధి చెందిదన్నారు. అడవిని పొడుచేసినా, నరికినా సహించేది లేదన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠి న చర్యలు తీసుకుంటామన్నారు. కలప స్మగ్ల ర్లు, వన్యప్రాణి వేటగాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. సీసీఎఫ్‌ వెంట ఇన్‌చార్జి  డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టి, ఎఫ్‌డీవో వజ్రారెడ్డి తదితరులు ఉన్నారు.

VIDEOS

logo