సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Dec 08, 2020 , 03:39:26

పామాయిల్‌ సాగుపై దృష్టి పెట్టండి

పామాయిల్‌ సాగుపై దృష్టి పెట్టండి

  • రైతులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూర్‌ ఏర్పాటు చేయండి
  •  పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలి
  •  జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాల్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి టౌన్‌ : హార్టికల్చర్‌ అధికారులు జిల్లాలో పామాయిల్‌ సాగుపై దృష్టి పెట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లిలో నిర్వహించిన జడ్పీ స్థాయీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 3,5,6 స్థాయీ సంఘాల సమావేశం ఎమ్మెల్యే రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించగా, 7, 1, 2, 4 సంఘాలు జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి జిల్లాలో పామాయిల్‌ పెద్ద ఎత్తున సాగయ్యేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలో 20 వేల హెక్టార్ల పామాయిల్‌ సాగుకు అనుకూలంగా ఉందని సర్వే రిపోర్ట్‌లు చెబుతున్నాయని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పామాయిల్‌ పెద్ద ఎత్తున సాగవుతోందని, అధికారులు ఇక్కడి రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలే కాకుండా పంట మార్పిడికి రైతులను ప్రోత్సహించాలని, ఇందుకోసం సాయిల్‌ పరీక్షలు చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలిపేలా కృషి చేయాని కోరారు. సమావేశంలో జడ్పీ సీఈవో నాగపద్మజ, జిల్లా హార్టికల్చర్‌ అధికారి అక్బర్‌, డీడబ్ల్యూఓ శ్రీదేవి, జడ్పీటీసీలు పాల్గొన్నారు. 

ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

రేగొండ: రైతు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే మద్ద తు ధరకు కొనుగోలు చేస్తుందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని నారాయణపురం గ్రామంలో సేంద్రియ వ్యవసాయ రైతు పరస్పర సహాయ సహకార సంఘం  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యా న్ని అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ నడిపెల్లి విజ్ఞాన్‌రావు, జడ్పీటీసీ సాయిని విజయముత్యంరావు, ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, లక్ష్మీనరసింహస్వామి అలయ చైర్మన్‌ ఇంగే మహేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్‌గౌడ్‌, సర్పం చ్‌, సునీత రవీందర్‌, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.

ముదిరాజ్‌ల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట

భూపాలపల్లి టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్‌ కులస్తుల అభ్యున్నతికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మండలంలోని పంబాపూర్‌ వద్ద గల భీంగణపురం చెరువులో సోమవారం సాయంత్రం ఆయన రొయ్య పిల్లలను వదిలి అనంతరం కమలాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే తలమానికంగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం కావడమే కాకుండా చెరువులు, కుంటలు నిండాయని, తద్వారా ముదిరాజ్‌ కులస్తులకు ఉపాధి దొరికిందన్నారు. ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేయడంతో పాటు వాహనాలను సబ్సిడీపై అందించి ఆదుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ కళ్లెపు శోభారఘుపతిరావు, ఎంపీ పీ మండల లావణ్య సాగర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సముద్రాల దీపాశ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి,  సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

VIDEOS

logo