సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Dec 06, 2020 , 07:04:21

సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలి

సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలి

  • భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ 
  • సెగ్గం వెంకటరాణి సిద్ధు
  • వేశాలపల్లిలో్ర పపంచ మృత్తికా దినోత్సవ వేడుకలు
  • 13వ వార్డులో నట్టల నివారణ మందు పంపిణీ

కృష్ణకాలనీ, డిసెంబర్‌ 5: రైతులు సేంద్రియ పద్ద్ధతిలో పంటలను సాగు చేయాలని భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి సిద్ధు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లిలో కౌన్సిలర్‌ బానోత్‌ రజితతో కలిసి ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్‌పర్సన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రైతుపై ఉందన్నారు. పంటలు పండిస్తున్న సమయంలో రైతులు రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలన్నారు. రసాయనాలు వినియోగించడం వల్ల వాటిని మనం తిని వ్యాధుల బారిన పడుతున్నామని తెలిపారు. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారాన్ని తింటే  ఎలాంటి వ్యాధులు దరి చేరవన్నారు. అనంతరం సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న వేశాలపల్లికి చెందిన ఇద్దరు రైతులు వేశాల సాంబయ్య, కుసుమ రాజమల్లును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, మెప్మా అధ్యక్షురాలు వేములవాడ రాజేశ్వరి, ఈఈ సునీల్‌, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.   

నట్టల  మందు వేయించాలి

పెంపకందారులు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేయించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణిసిద్ధు అన్నారు. మున్సిపాలిటీ పరిధి కాశీంపల్లిలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరై జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం యాదవులకు గొర్రెల యూనిట్లను అందజేసి ఆర్థికంగా ఆదుకున్నదని తెలిపారు. పెంపకందారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కొత్త హరిబాబు, జంగేడు పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌కుమార్‌, 13వ వార్డు కౌన్సిలర్‌ మంగళంపల్లి తిరుపతి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు మారెళ్ల సేనాపతి, బొంతల సతీశ్‌కుమార్‌, మేనం రాజేందర్‌, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo